Akkineni Family : ఐదు కోట్లకు దిగుకు పడిపోయిన అక్కినేని మార్కెట్.! యంగ్ హీరోలు అలా చేయాల్సిందే.!
NQ Staff - October 14, 2022 / 01:45 PM IST

Akkineni Family : అక్కినేని నాగార్జున తాజా చిత్రం ‘ది ఘోస్ట్’ డిజాస్టర్ రిజల్ట్ చవిచూసింది. అంతకు ముందు అక్కినేని నాగచైతన్య నటించిన ‘థాంక్యూ’ సినిమా కూడా డిజాస్టర్‌గా మారిపోయింది. నిజానికి, ‘ది ఘోస్ట్’ సినిమాకి మరీ అంత దారుణమైన టాక్ ఏమీ రాలేదు. ‘థాంక్యూ’ సినిమా విషయంలోనూ అంతే.
ఎక్కడో తేడా కొడుతోంది.! ఈ విషయాన్ని అక్కినేని హీరోలు గుర్తించడంలేదు. కమర్షియల్ సినిమాలకి అక్కినేని హీరోలు దూరమయ్యారా.? అంటే, ఔననే అనుకోవాలేమో. ‘లవ్ స్టోరీ’ సినిమా హిట్టయ్యిందంటే, దానికి చాలా కారణాలున్నాయ్. శేఖర్ కమ్ముల మ్యాజిక్, సాయి పల్లవి ఇమేజ్.. అన్నీ కలిసొచ్చాయ్.
‘బంగార్రాజు’ తర్వాత ఏదీ.?
‘బంగార్రాజు’ సినిమా ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. 50 కోట్ల పైన వచ్చిందంటూ ప్రచారం చేసుకున్నారు కూడా. అక్కినేని కాంపౌండ్‌లో ముఖ్యంగా ముగ్గురు హీరోలున్నారు. నాగార్జున, నాగచైతన్య, అఖిల్. ‘ఏజెంట్’ సినిమాతో అఖిల్ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడుగానీ, ఆ సినిమా విడుదల విషయంలో ఆపసోపాలు పడుతోంది.
వున్నపళంగా ఓ పెద్ద కమర్షియల్ హిట్ అక్కినేని ఫ్యామిలీకి కావాలి. ప్రయోగాలు పక్కన పెట్టి, విషయం వున్న కమర్షియల్ సినిమాల్ని చూసుకోకపోతే, ఐదు కోట్లకు దిగువకు పడిపోయిన మార్కెట్, మరింత దారుణంగా తయారయ్యే ప్రమాదమూ లేకపోలేదు.
కింగ్ అక్కినేని నాగార్జున ప్రయోగాలు చేయడంలో అర్థం వుంది. యంగ్ హీరోలు ప్రయోగాలు చేయకూడదని కాదు, ప్రయోగాలు చేసినా.. కమర్షియల్ కోణంలోనూ ఆలోచించాల్సిందే. లేకపోతే, అక్కినేని బ్రాండ్ వాల్యూ పడిపోతుంది.