Akkineni Family: అక్కినేని ఫ్యామిలీని వేదిస్తున్న విడాకులు.. నాగ్, సుమంత్, చైతూ….

Akkineni Family: తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో అక్కినేని ఫ్యామిలీకి ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు న‌ట వార‌స‌త్వంగా తీసుకొని చాలా మంది న‌టీన‌టులు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యారు. వెండితెర‌పై వీరు బాగానే అలరిస్తున్నాకూడా రియ‌ల్ లైఫ్‌లో మాత్రం విడాకులు, బ్రేక‌ప్‌ల‌తో హాట్ టాపిక్‌గా మారుతున్నారు.

Akkineni Family Haunting Around Divorce
Akkineni Family Haunting Around Divorce

అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున, సుమంత్‌, సుశాంత్‌, సుప్రియ, నాగచైతన్య, అఖిల్ వెండితెర‌పై అల‌రించినా కూడా రియ‌ల్ లైఫ్‌లో మాత్రం రియ‌ల్ లైఫ్‌లో మాత్రం ప‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. ముఖ్యంగా అక్కినేని ఫ్యామిలీని `విడాకులు`, `బ్రేకప్‌`లు ఇబ్బంది పెడుతున్నాయి. నాగార్జున మొదలు కొని ఇప్పుడు నాగచైతన్య వరకు విడాకుల అంశాలు అక్కినేని ఫ్యామిలీని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. చర్చనీయాంశంగా మారుస్తున్నాయి.

విడాకులు అనేది ముందుగా నాగార్జునతో మొద‌లైంది. వెంకటేష్‌ సిస్టర్‌ లక్ష్మీ దగ్గుబాటిని వివాహం చేసుకున్నారు నాగార్జున‌. 1984లో వీరి మ్యారేజ్‌ జరిగింది. నాగార్జున సినిమా హీరోగా రాణించడం, లక్ష్మీ డాక్టర్‌గా రాణించడం, ఇద్దరికి మనస్పార్థాలు రావడం, అండరస్టాండింగ్‌ కుదరకపోవడం, ప్రొఫేషనల్‌ డిఫరెన్సెన్స్ తో వీరిద్దరి ఆరేళ్ల తర్వాత విడిపోయారు. వీరికి నాగచైతన్య జన్మించారు.

అమ‌ల‌తో ప్రేమ‌లో ప‌డ్డ నాగార్జున 1992లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి అఖిల్‌ జన్మించారు. పెళ్లి తర్వాత అమల సినిమాలు ఆపేసి సామాజిక కార్యక్రమాల్లో భాగమవుతుంది . ఇక ఇదే ఫ్యామిలీ నుండి సుమంత్‌ సైతం విడాకులు తీసుకున్నారు. ఆయన తెలుగు హీరోయిన్‌ కీర్తిరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2004లో సుమంత్‌, కీర్తిరెడ్డి పెళ్లి చేసుకున్నారు. రెండేళ్లకి వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం సుమంత్‌ సింగిల్‌గానే ఉంటున్నారు.

నటి, ప్రొడ్యూసర్‌ సుప్రియ యార్లగడ్డ(నాగ్‌ కోడలు) సైతం మ్యారేజ్‌ లైఫ్‌ వివాదంగా మారింది. సుప్రియ `అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి’ చిత్రంలో పవన్ కళ్యాణ్‌తో నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆమె `ఇష్టం` సినిమా హీరో చరణ్‌ రెడ్డి ప్రేమలో పడింది. ఆయన్ని పెళ్లి చేసుకుంది. 2012లో ఆయన ఉన్నట్టుండి గుండెపోటుకి గురై చనిపోయారు. ఇద్ద‌రి మ‌ధ్య వ‌చ్చిన విబేధాల వ‌ల‌న అత‌నికి హార్ట్ ఎటాక్ వ‌చ్చింద‌ని అంటున్నారు.

అఖిల్‌కి కూడా పెళ్లి క‌లిసి రాలేదు. ఆయన ప్రముఖ డిజైనర్‌, జీవీకే మనవరాలు, షాలిని భూపాల్‌ కూతురు శ్రియా భూపాల్‌తో నాలుగేళ్ల క్రితం ఎంగేజ్‌మెంట్‌ అయ్యింది. త్వరలోనే పెళ్లికి సిద్ధమయ్యారు. కానీ ఇంతలోనే వీరిద్దరి మధ్య ఏర్పడ్డ మనస్పర్థాలు.. రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన డిఫరెన్సెస్‌తో పెళ్లికి ముందే విడిపోయారు

ఇక ఇప్పుడు నాగచైతన్య- సమంత‌లు అఫీషియ‌ల్‌గా విడిపోయారు. భ‌విష్య‌త్‌లో మేము స్నేహితులుగా మాత్ర‌మే ఉంటామ‌ని తెలియ‌జేశారు.