Akhil: త‌న ఫుల్ స‌పోర్ట్ ప్రియ ఆంటీ కే అంటున్న అఖిల్..!

Akhil: ప్ర‌స్తుతం ఇప్పుడు బిగ్ బాస్ మానియా న‌డుస్తుంది. ఎక్క‌డ చూసిన ఎవ‌రి మ‌ధ్య చూసినా కూడా బిగ్ బాస్ గురించే చ‌ర్చ న‌డుస్తుంది. ఎవ‌రు క‌ప్ గెలుస్తారు, ఎవ‌రు ఎలిమినేట్ అవుతారు. ఎవ‌రి ప్ర‌వ‌ర్త‌న ఏంటి అనే విష‌యాల‌పై జోరుగా చ‌ర్చ‌లు న‌డుపుతున్నారు.అయితే హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌కి గ‌త సీజ‌న్‌లో పాల్గొన్న కంటెస్టెంట్స్ కూడా మ‌ద్ద‌తు ఇస్తున్నారు.

Akhil Says Full Support to Priya in Bigg Boss5 Telugu
Akhil Says Full Support to Priya in Bigg Boss5 Telugu

బిగ్ బాస్ సీజ‌న్ 4 కార్య‌క్ర‌మంతో ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు అఖిల్‌.ఇత‌డు ఫ్రెండ్షిప్, ల‌వ్ ట్రాక్‌తో ఎక్కువ ఆద‌ర‌ణ పొందాడు. అఖిల్‌-సోహైల్‌-మెహబూబ్‌ల ఫ్రెండ్‌షిప్‌కు కూడా చాలామంది ఫ్యాన్స్‌ ఉన్నారు. గతేడాది బిగ్‌బాస్‌ షోలో రన్నరప్‌గా నిలిచిన అఖిల్ ప్ర‌స్తుతం వెబ్‌ సిరీస్‌తో పాటు ‘ఫస్ట్‌ టైమ్‌’ అని ఓ సినిమా కూడా చేస్తున్నాడు.

అయితే అత‌ను ప్ర‌స్తుతం బిగ్ బాస్ సీజ‌న్5లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని భావిస్తున్న ఓ వ్య‌క్తికి ఫుల్ స‌పోర్ట్ అందిస్తున్నాడు. శైలజా ప్రియ.మ‌న‌కు తెలిసిన పేరు ప్రియ‌. ఆమెకు తన ఫుల్‌ సపోర్ట్‌ ఉంటుందని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఆమెకు సపోర్ట్‌ చేస్తూ వీడియోలు పెట్టాడు.

‘ఈ సీజన్‌ మొత్తానికి తను కెప్టెన్‌ కాలేకపోయినా టాస్కుల్లో మాత్రం తన బెస్ట్‌ ఇవ్వడం నిజంగా గొప్ప విషయం. మీరు ఫైటర్‌ అన్న విషయం తెలుసనుకోండి.. అయినప్పటికీ మీకు మరింత శక్తి రావాలని కోరుకుంటున్నాను ప్రియగారూ..’ అంటూ ఆమెకు మ‌ద్ద‌తు ప‌లికాడు. త‌న అభిమానుల‌కి కూడా ఓట్లేయ‌మ‌ని చెప్పాడు.