Akhil sarthak : బిగ్ బాస్ షోకు రాకముందు అఖిల్ సార్థక్ అంటే ఎవ్వరికీ తెలిసిందే. ఊరు పేరు తెలియని సినిమాల్లో సైడ్ ఆర్టిస్ట్‌గా, బుల్లితెరపై కొన్ని సీరియల్స్‌లో విలన్ రోల్ పోషించినా కూడా అఖిల్‌ను ఎవ్వరూ గుర్తు పట్టేవారు కాదు. కానీ బిగ్ బాస్ షో మాత్రం అఖిల్‌ను లైఫ్‌ను మార్చేసింది. ఇప్పుడు అఖిల్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారెవ్వరూ ఉండరు. మోనాల్ విషయంతో అఖిల్ మరింతగా పాపులర్ అయ్యాడు.

అయితే అఖిల్ ఆకారం చూస్తే ఎంతో పెద్ద వాడిలా అనిపిస్తాడు. కానీ వయసు మాత్రం చాలా చిన్నది. పాతికేళ్ల కుర్రాడే కానీ అలా కనిపించడు. బిగ్ బాస్ షోలో ఈ వయసు, చదువు గురించి పెద్ద రచ్చే జరిగింది. అభిజిత్ అఖిల్ మధ్య వయసు, స్టడీస్ అంటూ జరిగిన సంభాషణ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. 25 ఏళ్లు వచ్చే సరికి తనకంటూ సొంతంగా కారు ఉండాలని ఎప్పుడో కలలు కన్నాడట.
Akhil sarthak : అఖిల్ సార్థక్ సాధించేశాడు!
మొత్తానికి ఆ కలలు నెరవేర్చుకున్నాడు. తాజాగా అఖిల్ ఓ కారును కొన్నాడు. ఈ విషయం చెబుతూ తెగ సంబరపడిపోయాడు. తన కల నెర వేరిందని.. ఇదంతా తన కష్టం, హార్డ్ వర్క్ వల్లే సాధ్యమైందంటూ చెప్పుకొచ్చాడు. తాజాగా అఖిల్ చేసిన పోస్ట్‌పై మోనాల్, సోహెల్ స్పందించారు.
25 ఏళ్లు వచ్చేలోపు నాకు నేను కారు కొనుక్కుంటానని ప్రామీస్ చేసుకున్నాడు. ఇప్పుడు అది నిజమైంది. ఇదంతా నా కష్టం వల్లే సాధ్యమైంది. కష్టపడి పని చేస్తే ఎప్పటికైనా ఫలితం వస్తుంది.. మా అమ్మనాన్న, మీ ప్రేమ లేకుంటే ఇదంతా సాధ్యమయ్యేది కాదని ఎమోషనల్ అయ్యాడు. అఖిల్ కారు కొనడంతో మోనాల్, సోహెల్ తెగ సంబరపడిపోతూ కంగ్రాట్స్ చెప్పారు.
View this post on Instagram