BIGG BOSS: 27 స్క్రిప్ట్స్‌ని రిజెక్ట్ చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. ఎట్ట‌కేల‌కు ఫ‌స్ట్ టైంతో వెండితెరపై సంద‌డికి సిద్దం

BIGG BOSS అన్ని ప్రాంతీయ భాష‌ల‌లో స‌క్సెస్‌ఫుల్‌గా న‌డుస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్య‌క్రమం తెలుగులోను మంచి ఆద‌ర‌ణ సంపాదించుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ షో నాలుగు సీజ‌న్స్ పూర్తి చేసుకోగా, త్వ‌ర‌లో ఐదో సీజ‌న్ జ‌రుపుకునేందుకు సిద్ధ‌మైంది. అయితే బిగ్ బాస్ కార్య‌క్ర‌మం ద్వారా చాలా మంది సెట్ అయ్యారు. షోకు ముందు జ‌నాల‌కు ప‌రిచ‌యం లేని వారు షో అనంత‌రం సెల‌బ్రిటీలుగా మారారు. ఇందుకు ఉదాహ‌ర‌ణే అఖిల్,మోనాల్, అరియానా, సోహెల్. వీరు బిగ్ బాస్ సీజ‌న్ 4 కార్య‌క్ర‌మంకు రాక‌ముందు జ‌నాల‌కు ఏ మాత్రం ప‌రిచ‌యం లేదు. కాని ఇప్పుడు వారు సెన్సేష‌న్.

బిగ్ బాస్ షో త‌ర్వాత సోహెల్ హీరోగా తొలి సినిమా మొద‌లు పెట్టాడు. మోనాల్ కూడా ఓ సినిమాలో స్పెష‌ల్ సాంగ్ చేసి అల‌రించింది. అఖిల్‌తో క‌లిసి తెలుగబ్బాయి-గుజరాతీ అమ్మాయి అనే వెబ్‌సిరీస్ కూడా చేస్తుంది. ఇక అఖిల్ విష‌యానికి వ‌స్తే సినిమా హీరోగా లేదంటే విల‌న్‌గా న‌టించాల‌ని ఎన్నో క‌ల‌లు క‌నేవాడు. బిగ్ బాస్ షోతో అది తీరింది. ఫ‌స్ట్ టైం అనే సినిమాను మొద‌లు పెట్టిన అఖిల్ ఈ సినిమాకు సంబంధించిన ఇంట‌ర్వ్యూలో భాగంగా ప‌లు విష‌యాలు చెప్పుకొచ్చాడు. ఫ‌స్ట్ టైం సినిమాకు ముందు దాదాపు 27 స్టోరీలు విన్నానని, ‘ఫస్ట్‌ టైం’ స్క్రిప్ట్ నచ్చడంతో వెంటనే ఓకే చేశానని చెప్పుకొచ్చాడు. అతి త్వ‌ర‌లోనే ఈ మూవీ షూటింగ్ మొద‌లు పెట్టి సెప్టెంబ‌ర్‌లో చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని అనుకుంటున్నాం.

ఫ‌స్ట్ టైం చిత్రంలో అఖిల్‌కు జంట‌గా అనిక విక్ర‌మ‌న్ న‌టిస్తుంది. అయితే మోనాల్‌ను ఈ చిత్రంలో క‌థానాయిక‌గా ఎంపిక చేయ‌క‌పోవ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో స్పందించాడు. చిత్రంలో క‌థానాయిక ఎంపిక అనేది ద‌ర్శ‌కుడి ఇష్టం. ఆయ‌న ఇష్టానుసారంగానే అనిక‌ను తీసుకున్నారు. మోనాల్‌తో రానున్న రోజుల‌లో మంచి సినిమా చేస్తానంటూ అఖిల్ చెప్పుకొచ్చాడు. తొలి సినిమా హిట్టైతే మాత్రం రానున్న రోజుల‌లో అఖిల్‌కు వ‌రుస ఆఫర్స్ రావ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

Advertisement