AKHIL బిగ్ బాస్ సీజన్ 4 కార్యక్రమంకు సామాన్య కంటెస్టెంట్‌గా హాజరై ఇప్పుడు సెలబ్రిటీగా మారిన వ్యక్తి అఖిల్ సార్ధక్. సీజన్ 4లో అఖిల్ ఎక్కువగా మోనాల్‌తో ప్రేమ, గొడవ, స్నేహంతోనే బాగా పాపులర్ అయ్యాడు. వీరిద్దరిని చూసిన ప్రేక్షకులకి ఇద్దరి మధ్య ఏం ఉందో తెలియక జుట్టు పీక్కున్నారు. హౌజ్‌లోనే కాదు బయటకు వచ్చాక కూడా అఖిల్, మోనాల్ వ్యవహారం కాస్త తేడాగానే ఉంది. అయితే మీడియా పర్సన్స్ మీ మధ్య ఏం నడుస్తుంది అని ప్రశ్నిస్తే అది స్నేహం మాత్రమే అని చెప్పి సింపుల్‌గా తప్పించుకుంటున్నారు.
బిగ్ బాస్ సీజన్ 4 కార్యక్రమం అఖిల్, మోనాల్ లైఫ్‌ను పూర్తిగా మార్చేసింది. మోనాల్ టీవీ షోస్ , సినిమాలతో బిజీగా ఉండగా అఖిల్ కూడా పలు ప్రాజెక్ట్‌లతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఈ మధ్య కొత్త కారు కూడా కొన్నాడు. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేయగా, దానికి మోనాల్ స్పందించింది. అయితే బిగ్ బాస్ షో అయ్యాక అఖిల్- మోనాల్ మధ్య మరింత బంధం ఏర్పడింది. బుల్లితెరపై వచ్చే ఇతర షోలు, స్పెషల్ ఈవెంట్లలో ఈ ఇద్దరి ట్రాకును బాగానే ప్రమోట్ చేస్తున్నారు. ఇద్దరి ప్రధాన పాత్రలో ఓ వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేశారు. రియల్ లైఫ్ మాదిరిగానే రీల్ లైఫ్‌ను చిత్రీకరిస్తున్నట్టు మేకర్స్ చెప్పుకొచ్చారు.
అఖిల్- మోనాల్‌లు నిత్యం టచ్‌లో ఉంటారనే సంగతి చాలా మందికి తెలుసు. కాని వీడియో కాల్స్ కూడా మాట్లాడుకునేంత టచ్‌లో ఉంటారని మాత్రం తెలియదు. రీసెంట్గా అఖిల్, మోనాల్ ఇద్దరు వీడియో కాల్ మాట్లాడుకోగా, దానిని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు అఖిల్. మా సంతోషం ఇలా ఉందంటూ లవ్ ఎమోజీ జత చేశాడు. అంతేకాక ప్రేమ క్యాన్సర్ వంటిది. అది మరచిపోయినట్టు చేస్తుంది. చివరకు ప్రాణాలు కూడా తీసుకుపోతుంది. అని ప్రేమపై కాస్త వేధాంత ధోరణిలో మాట్లాడాడు. అఖిల్ పోస్ట్‌తో అందరిలో అనుమానాలు మొదలయ్యాయి..