Akhil-Monal: అఖిల్‌-మోనాల్ క్రేజీ డ్యాన్స్‌.. చ‌క్క‌ర్లు కొడుతున్న వీడియో

Akhil-Monal: బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించిన బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. నాలుగేళ్లుగా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న ఈ షోలో కొన్ని ల‌వ్ ట్రాక్స్ న‌డిచాయి. ఇవి ప్రేక్ష‌కుల‌కి ఎంతో వినోదాన్ని అందించాయి. బిగ్ బాస్ నాలుగో సీజన్ ఆరంభం అయిన కొంత కాలానికే అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్ మధ్య ప్రేమ చిగురించింది. అందుకు అనుగుణంగానే వీళ్లిద్దరూ హౌస్‌లో రొమాన్స్ చేస్తూ రచ్చ రచ్చ చేసేశారు.

అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్ బయటకు వచ్చిన తర్వాత కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. షో ముగిసిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఎన్నో సార్లు వీళ్ళిద్దరూ కలుసుకున్నారు. తరచూ పార్టీలు చేసుకోవడం.. సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టుకోవడం.. వీడియో కాల్స్ మాట్లాడుకోవడం వంటివి చేశారు. ఈ ఇద్ద‌రు ఇప్పుడు ‘తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి’ అనే వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు.

ఈ ఇద్దరికీ డేట్స్ అడ్జస్ట్ అయినప్పుడు ఆ సిరీస్ పూర్తి చేస్తాం’ అంటూ క్లారిటీ ఇచ్చాడీ స్టార్ బాయ్. అయితే అప్పుడప్పుడు క‌లిసి సంద‌డి చేసే ఈ జంట తాజాగా ఓ డ్యాన్స్ వీడియో చేశారు.ఇందులోఇద్ద‌రు వేసిన స్టెప్స్ కేక పెట్టిస్తున్నాయి. డ్యాన్స్ వీడియో అదిరింద‌ని క్యూట్ కామెంట్స్ చేస్తేన్నారు.