Akhil Akkineni: ఆ స్టార్ క్రికెట‌ర్ బ‌యోపిక్‌లో న‌టించాల‌నే కోరిక వ్య‌క్త‌ప‌ర‌చిన అఖిల్

Akhil Akkineni: అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు స‌క్సెస్ కోసం ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నాడు. ఆయ‌న న‌టించిన అఖిల్, హలో, మిస్టర్ మజ్ను చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. అంతగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో అఖిల్ ఆశలన్నీ ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా పైనే ఉన్నాయి. అటు అఖిల్‌, ఇటు భాస్కర్ కెరీర్‌కు కీల‌కంగా మార‌డంతో సినిమాకు ఎక్కడ‌లేని ప్రాధాన్యత వ‌చ్చింది.

Akhil Akkineni Wish to Act in Virat Kohli Biopic
Akhil Akkineni Wish to Act in Virat Kohli Biopic

ఈ సినిమా అఖిల్‌కి చాలా కీల‌కంగా మార‌గా, ఈ చిత్రాన్ని ప్ర‌మోట్ చేసుకునేందుకు అఖిల్ బాగా క‌ష్ట‌ప‌డుతున్నాడు. ఇందులో భాగంగా మ‌న‌సులోని మాట‌లు చెబుతున్నాడు. తాను విరాట్ కోహ్లీ బ‌యోపిక్‌లో న‌టించాల‌నే ఆస‌క్తి ఉన్న‌ట్టు తెలియ‌జేశాడు. ప్ర‌స్తుతం ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. మరీ ముఖ్యంగా క్రికెట్‌లో ఈ హవా మరింత ఎక్కువగా ఉంది.

ఇప్పటికే మిస్టర్‌ కూల్‌, మహేంద్ర సింగ్‌ ధోని బయోపిక్‌, టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ బయోపిక్‌లు రిలీజ్‌ కాగా.. ఈ ఏడాది క్రిస్మస్‌కు క్రికెట్‌ లెజెండ్‌ కపిల్‌ దేవ్‌ బయోపిక్‌ విడుదల కాబోతుంది. అయితే తాజాగా రన్నింగ్‌ మిషెన్‌, విరాట్‌ కోహ్లీపై బయోపిక్‌ రాబోతుందన్న వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఈ బ‌యోపిక్ తీస్తే మాత్రం తాను కోహ్లీ పాత్ర‌లో మెరుస్తాను అని చెప్పుకొచ్చాడు.

ఎంతో మంది జీవితాలను విరాట్ కోహ్లీ ప్రభావితం చేశాడని, అతడి బయోపిక్ తీస్తే బాగుంటుందని చెప్పాడు. క్రికెట్ మీద అతడికున్న ఫ్యాషన్ తో సినిమా తీస్తే.. చాలా అగ్రెసివ్‌గా ఉంటుందని, నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ బయోపిక్ తిరుగులేని కథగా నిలబడుతుందన్నాడు.