Akhil: బాప్ రే.. అఖిల్ ఇంత ర‌ఫ్ లుక్‌లోకి మారాడేంటి..!

Akhil: అక్కినేని మూడో త‌రం వార‌సుడు అఖిల్ కెరీర్‌లోమూడు సినిమాలు పూర్తి చేశాడు. ఒక్క చిత్రం కూడా అత‌ని కెరీర్‌కు ఉప‌యోగ‌ప‌డ‌లేదు. త‌న నాలుగో చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో చేస్తున్నాడు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాలో అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాల బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందని చిత్రబృందం విశ్వాసంగా ఉంది.

Akhil
Akhil

అఖిల్ గత చిత్రాలు వరుసగా అఖిల్, హలో, మిస్టర్ మజ్ను ప్రేక్ష‌కుల‌ని ఏ మాత్రం అలరించలేకపోయాయి. దీంతో ఈ సినిమా హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కంతో ఉన్నాడు. ఇందులో క‌థానాయిక‌గా పూజా హ‌గ్డే న‌టించ‌గా ఇటీవ‌ల ఈ అమ్మ‌డు న‌టించిన చిత్రాల‌న్ని మంచి విజ‌యం సాధిస్తుండ‌డంతో ఆ సెంటిమెంట్ అఖిల్ సినిమాకు పని చేస్తుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. మ‌రో వైపు లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ చూపించడంలో సిద్ధహస్తుడైన భాస్కర్ అవి తనదైన శైలిలో చిత్రకరించాడట.

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ను జి2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నా ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ఎప్పుడో విడుద‌ల కావ‌ల‌సి ఉన్న‌ప్ప‌టికీ క‌రోనా వల‌న వాయిదా ప‌డింది. ఇక ఈ సినిమా రిలీజ్ కాక‌ముందే సురేంద‌ర్ రెడ్డి ద‌ర్వ‌క‌త్వంలో సినిమా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాడు అఖిల్‌. చిరంజీవి సైరా నరసింహా రెడ్డితో బ్లాక్ బస్టర్ కొట్టిన సురేందర్ రెడ్డి ఇప్పుడు అఖిల్‌తో ఏజెంట్ అనే ప‌క్కా మాస్ సినిమా చేస్తున్నాడు.

వక్కంతం వంశీ అందించిన పవర్ ఫుల్ స్టొరీతో ఏజెంట్ అనే చిత్రం భారీ స్థాయిలో రూపొందనుంది. అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డిల క్రేజీ కాంబినేషన్లో రానున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్నిఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సురెండర్2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు.తాజాగా ఈ స్టైలిష్ స్పై థ్రిల్లర్ నుండి ఒక వైల్డ్ పోస్టర్ వచ్చింది. పోస్టర్ లో అఖిల్ నరాలు కూడా బలంగా ఎలివేట్ అయ్యేలా కండలు తిరిగి వెనుక వైపు ఉండి మరీ వైల్డ్ గా భారీ రైడ్ కి సిద్ధం అయినట్లు కనిపిస్తోంది.

ఇది ఆరంభం మాత్రమే. ముందు ముందు ఉంది పండగ’ అంటూ ఓ పోస్టర్‌ను వ‌దిలిన సురేంద‌ర్ రెడ్డి మూవీపై భారీ అంచ‌నాలు పెంచారు. ఇక ఈ సినిమాలో మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి రెగ్యులర్‌ షూటింగ్‌ ఈనెల 12 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది.