Akhil Agent : ‘ఏజెంట్’ అఖిల్ అక్కినేని పరిస్థితేంటి చెప్మా.?

NQ Staff - December 7, 2022 / 08:23 PM IST

Akhil Agent : ‘ఏజెంట్’ అఖిల్ అక్కినేని పరిస్థితేంటి చెప్మా.?

Akhil Agent : సినిమా పూర్తయ్యిందా.? లేదా.? అప్పుడెప్పుడో సినిమా ఆగస్టులో అన్నారు.. ఆ తర్వాత అది సంక్రాంతికి షిఫ్ట్ అయినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, సంక్రాంతికి సినిమా వస్తుందో లేదో డౌటు.!

అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన ‘ఏజెంట్’ సినిమాకి టాలెంటెడ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన విషయం విదితమే. అక్కినేని అఖిల్ స్టామినాకి మించి ఖర్చు చేశారు ఈ ‘ఏజెంట్’ సినిమాకి.

పాన్ ఇండియా ఇమేజ్..

‘ఏజెంట్’ ప్రోమో వచ్చాక, అంతా షాక్‌కి గురయ్యారు. అఖిల్ మీద ఎంత ఖర్చు చేసినా ఫర్లేదన్న భావన కలిగింది అందరిలోనూ. సినిమాపై విపరీతమైన పాజిటివ్ బజ్ కూడా వచ్చింది. కానీ, సినిమా ఏదీ.?

రోజులు, నెలలు గడిచిపోతున్నాయ్.. ‘అఖిల్’ సినిమా తదుపరి అప్డేట్ అయితే రావడంలేదు. సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి పుట్టినరోజు నేపథ్యంలో సినిమా, రిలీజ్ డేట్ మీద మేకర్స్ స్పష్టత ఇస్తారా.? అంటే, ఆ పరిస్థితీ కనిపించడంలేదాయె.

మంచి సినిమాని ఇలా కిల్ చేసేయడం బాగాలేదంటూ అఖిల్ అక్కినేని అభిమానులు, చిత్ర నిర్మాణ సంస్థపై మండిపడుతున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us