Akhanda: అఖండ సీక్వెల్ ప్లాన్.. ఎక్క‌డి నుండి మొద‌లు కానుంది అంటే..!

Akhanda: సింహా, లెజెండ్ చిత్రాల త‌ర్వాత బోయ‌పాటి- బాల‌కృష్ణ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం అఖండ‌. ఈ సినిమా డిసెంబర్ 2న విడుద‌ల కాగా, మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించింది. క‌రోనా సెకండ్ వేవ్ త‌ర్వాత ఈ మూవీకి వ‌చ్చిన రెస్పాన్స్ చూసి సినిమా ఇండ‌స్ట్రీ కూడా ఫుల్ ఖుష్ అయింది. సినిమాలో ప్ర‌తి ఒక్క‌టి కూడా మంచిగా కుదర‌డంతో చిత్రం మంచి విజ‌యం సాధించింది.

akhanda sequel plan2
akhanda sequel plan2

అఖండ సినిమాలో బాలయ్య పోషించిన అఘోర పాత్ర హైలైట్ గా నిలిచింది. బాలకృష్ణ తన కెరియర్లో ఇంతవరకూ వేస్తూ వచ్చిన గెటప్పులలో అత్యధిక మార్కులను ఈ గెటప్ దక్కించుకుంది. సాఫ్ట్ గా కనిపించే పాత్రలో బాలయ్య ఎంత హ్యాండ్సమ్ గా కనిపించారో అఘోర పాత్రలో ఆయన అంత గంభీరంగా అనిపించారు. సన్నివేశాల తీవ్రత .. డైలాగ్స్ లోని పవర్ ప్రేక్షకులను కదలనీయకుండా చేశాయి.

ఈ మధ్య కాలంలో ఒక సినిమా అనేది పట్టుమని వారం రోజులు కూడా థియేటర్లలో నిలబడటం లేదు. అలాంటిది ‘అఖండ’ 50 రోజుల దిశగా పరుగులు తీస్తుండటం విశేషం. సంక్రాంతికి ఒక్క ‘బంగార్రాజు’ తప్ప చెప్పుకోదగిన సినిమాలేవీ బరిలో లేవు. ‘పుష్ప’ ఓటీటీలో స్ట్రీమింగ్ కావడం వలన థియేటర్లలో దూకుడు తగ్గింది. అందువలన ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో మళ్లీ ‘అఖండ’ వసూళ్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

akhanda sequel plan1
akhanda sequel plan1

అఖండ చిత్రానికి ముందుగా సీక్వెల్ చేయాలనే ఆలోచన లేనప్పటికీ ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ ను చూసిన తరువాత జరిగిన కథలో నుంచి బలమైన ఒక పాయింటును పట్టుకుని అక్కడి నుంచి సీక్వెల్ కి తగిన కథను అల్లుకుంటూపోయే ఆలోచనలో చేస్తున్నారు.ఇప్పుడు ప్రేక్షకులంతా కూడా సీక్వెల్ కథ ఎక్కడి నుంచి మొదలుకావొచ్చుననే విషయంపై ఆసక్తికరమైన చర్చలు చేస్తున్నారు.

‘అఖండ’లో తన కవల సోదరుడి కూతురికి బాలయ్య ఒక మాట ఇస్తాడు. ఎప్పుడు ఎలాంటి ఆపద వచ్చినా తనని తలచుకోమనీ .. ఆ వెంటనే తాను ఆమె ముందు ఉంటానని చెబుతాడు. ఈ పాయింట్ నుంచే సీక్వెల్ కథను తీయవచ్చని చెప్పుకుంటున్నారు. కవల సోదరుడి కూతురు పెద్దవడం .. ఆమె ఆపదలో పడటం .. ప్రమాదం మరో వైపు నుంచి రావడం .. ప్రతినాయకుడి స్థానంలో మరొకరు ప్రత్యక్షం కావడం .. ఇలా సీక్వెల్ కూడా ఇంట్రస్టింగ్ గా సాగడానికి తగిన కథ ఉందని అనుకుంటున్నారు.