Akhanda: టాలీవుడ్‌లో స‌రికొత్త ట్రెండ్‌ క్రియేట్ సెట్ చేయ‌బోతున్న అఖండ‌..!

Akhanda: నంద‌మూరి న‌టసింహం బాల‌కృష్ణ‌, స్టార్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శీను కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం అఖండ‌. క‌రోనా సెకండ్ వేవ్ తర్వాత వ‌చ్చిన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా, జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

AKhanda Movie Success Meet After 42 Days
AKhanda Movie Success Meet After 42 Days

భారీ అంచనాల నడుమ గతేడాది డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. తాజాగా ఈ సినిమా 39 రోజులు గడిచినా కూడా ‘అఖండ’ ఇంకా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న తీరు చూసి అంతా షాక్ అవుతున్నారు. అఖండ సినిమా 39 రోజుల్లో వారాల్లో రూ. 72. 63 కోట్లకు పైగా షేర్ (127.75 కోట్ల గ్రాస్) వసూలు చేసింది.

అఖండ చిత్రంలో బాల‌కృష్ణ న‌ట‌న‌, బోయ‌పాటి డైరెక్ష‌న్‌తో పాటు తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా పాపులర్ అయ్యాయి. టైటిల్ సాంగ్ ’అఖండ’తో పాటు ‘జై బాలయ్య’ పాటకు మాస్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్‌గా ఈ సినిమా నుంచి జై బాలయ్య ఫుల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అయితే తాజాగా అఖండ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తుంది. సినిమా విడుద‌లైన 42 వ రోజు చిత్ర బృందం స‌క్సెస్ మీట్ ప్లాన్ చేస్తూ టాలీవుడ్ లో స‌రికొత్త ట్రెండ్ క్రియేట్ చేయాల‌ని అనుకుంటుంద‌ట‌.అంతేకాక ఈ సినిమా సంక్రాంతిని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని అనుకుంటుంద‌ట‌.

AKhanda Movie Success Meet After 42 Days
AKhanda Movie Success Meet After 42 Days

ఏపీ తెలంగాణలో హవా చూపించిన ‘అఖండ’ మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో 39 రోజుల్లో రూ. 61.89 కోట్లు అందుకున్న ఈ సినిమా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.04 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.70 కోట్లు రాబట్టింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 72.63 కోట్లు షేర్, రూ. 127.75 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.