Akhanda Movie : హిందీ ‘అఖండ’ ను జనాలు పట్టించుకుంటున్నారా?
NQ Staff - January 20, 2023 / 03:11 PM IST

Akhanda Movie : నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా ఇటీవల సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. వీర సింహారెడ్డి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుని ఇప్పటికే వంద కోట్లకు పైగా కలెక్షన్స్ నమోదు చేసింది.
ఈ సమయంలోనే బాలకృష్ణ 2021 డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన అఖండ సినిమా ఇప్పుడు హిందీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేడు హిందీలో భారీ ఎత్తున విడుదలైన అఖండ సినిమాకు ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా అనేది అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పుష్ప మరియు కార్తికేయ 2 సినిమాలు ఉత్తర భారతంలో భారీ విజయాలను సొంతం చేసుకున్న కారణంగా ఈ సినిమా కూడా అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకొని భారీగా కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని అఖండ మేకర్స్ భావిస్తున్నారు.
ప్రముఖ హిందీ చిత్ర నిర్మాణ సంస్థ అక్కడ అఖండను రిలీజ్ చేయడంతో కచ్చితంగా పాజిటివ్ వైబ్స్ కలిగాయి అనడంలో సందేహం లేదు. అయితే అఖండ మెల్ల మెల్లగా హిందీ ప్రేక్షకులకు ఎక్కే అవకాశం ఉంది, కనుక మొదటి వారం రోజులు పూర్తయితే కానీ హిందీలో అఖండ యొక్క ఫలితం ఏంటి? జనాలు చూస్తారా లేదా అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.