Akhanda : అఖండకి అదిరిపోయో రెస్పాన్స్..బ్లాక్ బస్టర్ అంతే..!

Akhanda : అఖండ.. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ సినిమా. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. సింహ, లెజెండ్ సినిమాల తర్వాత బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా. అందుకే ఈ సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక బీబీ3 ఫస్ట్ రోర్..అలాగే ఇటీవల రిలీజైన టైటిల్ అండ్ టీజర్ సినిమా మీద అంచనాలను మరో స్థాయికి తీసుకు వచ్చాయి. అఖండ టీజర్ 30మిలియన్స్ వ్యూస్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. దాంతో నందమూరి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

akhanda is going to become a block buster...!
akhanda is going to become a block buster…!

కాగా ఈ రేంజిలో టీజర్ రెస్పాన్స్ వచ్చిన్నప్పటికీ చిత్రబృందం మాత్రం ఎలాంటి హడావిడి చేయడం లేదు. ఇంకా సినిమా రిలీజ్ కి కూడా పెద్ద సమయం లేదు. ఇదే మంచి అవకాశం సినిమాని ప్రేక్షకులకి మరింత దగ్గర చేసేందుకు. కాని మేకర్స్ అఖండ సినిమాను ప్రమోట్ చేసే సన్నాహాలేవీ చేసినట్లు కనిపించడం లేదు. మరొక సినిమా అయితే ఈ ఫీట్ ని బాగా ఉపయోగించుకుంటారు. మరి అఖండ టీమ్ మాత్రం ఎందుకు సైలెంట్ గా ఉందో అని నేటిజన్స్, ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారట. చూడాలి మరి మేకర్స్ ఈ సినిమాను ఇదే ఊపులో ప్రమోట్ చేస్తే బాగుంటుంది.

Akhanda : అఖండ టీం కూడా ఆలోచనలో ఉన్నారట..!

అయితే కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎప్పుడు తగ్గుతుందో క్లారిటీ లేదు. ఇప్పటికే సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. రిలీజ్ డేట్స్ కూడా మార్చుకుంటున్నారు. అందుకే అఖండ టీం కూడా ఆలోచనలో ఉన్నారని మరో మాట కూడా వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రగ్యాజైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా.. మిర్యాల రవీందర్ రెడ్డి ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బాలయ్య మైత్రీ మూవీస్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకుడు.

Advertisement