AKHANDA: బాల‌య్య గ‌ర్జ‌న‌.. రికార్డులు చెరిపేస్తున్న అఖండ‌

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య‌ అంటే అభిమానుల‌లో ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం బోయ‌పాటి శీను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ సినిమా చేస్తుండ‌గా, మోస్ట్ అవైటెడ్ చిత్రంగా ఈ మూవీ రూపొందుతుంది. సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ త‌ర్వాత ఈ చిత్రం రూపొందుతుండ‌డంతో అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఇందులో నందమూరి బాలకృష్ణ స‌ర‌స‌న ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా, మిర్యాల రవీందర్ రెడ్డి సినిమాను నిర్మిస్తున్నాడు. యంగ్ సెన్సేషన్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మే 28న అఖండ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు కానీ ఈ టైంకు సినిమా రావ‌డం కాస్త డౌట్ అని చెప్ప‌వ‌చ్చు.

ఉగాది సంద‌ర్భంగా చిత్రం నుండి టైటిల్ టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా, ఈ టీజ‌ర్ రికార్డుల వేట మొద‌లు పెట్టింది. ఇప్ప‌టికే సౌత్ హీరోలంద‌రికి రికార్డ్స్ బ‌ద్ద‌లు కొట్టిన అఖండ రీసెంట్ ర‌జ‌నీకాంత్ న‌టించిన కబాలి రికార్డ్‌ని సైతం బ్రేక్ చేసింది. కేవ‌లం విడుద‌లైన 11 రోజుల‌లోనే 38 మిలియ‌న్ వ్యూస్‌ని క్రాస్ చేశాడు.ఈ రికార్డ్ గ‌తంలో కబాలిపై ఉండేది. ప్ర‌స్తుతం అఖండ టీజ‌ర్ 40 మిలియ‌న్స్‌కు పైగా వ్యూస్ సాధించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.

Advertisement