AKHANDA: అఖండ హంగామా షురూ కాబోతుంది.. ఫ్యాన్స్ ఇక ర‌చ్చ చేయ‌డ‌మే లేటు..!

AKHANDA నంద‌మూరి బాల‌కృష్ణ‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. ఎక్కువ‌గా మాస్ అభిమానుల‌ని సంపాదించుకున్న బాల‌కృష్ణ ఫ్యాన్స్ కోసం ప‌వ‌ర్ ఫుల్ మాస్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ అల‌రిస్తున్నాడు. ప్ర‌స్తుతం బోయ‌పాటి శీను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం కూడా ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్ ఓరియెంటెడ్ చిత్రంగా ఉంటుంద‌ని స‌మాచారం. సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ త‌ర్వాత ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమా రూపొందుతుండ‌డంతో అంచ‌నాలు భారీగా ఉన్నాయి.

ఇటీవ‌ల విడుద‌లై టీజర్ తో అంచనాలు మరో స్థాయిలో సెట్ చేసుకున్న ఈ చిత్రం ఆడియో హక్కులు కూడా ఈ మధ్యనే లహరి మ్యూజిక్ వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మే 28కు సినిమాను రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తుండ‌గా, ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు మొద‌లు పెడుతున్నారు. థ‌మ‌న్ స్వ‌ర‌ప‌ర‌చిన బాణీల‌ను ఒక్కొక్క‌టిగా విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే ఇప్పటికే థమన్ ఇచ్చిన అవుట్ స్టాండింగ్ బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ కు సాలిడ్ రెస్పాన్స్ రాగా, సాంగ్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో అని ప్ర‌తి ఒక్క‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ ఫస్ట్ సింగిల్ ఎప్పుడు విడుద‌ల అవుతుందో చూడాలి.

Advertisement