Akash Puri: ఈడు హీరో ఏంట్రా అని చాలా మంది అన్నారు.. కాని నాన్న గ‌ర్వ‌ప‌డేలా చేస్తా..

Akash Puri డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాశ్ పూరి మంచి హిట్ కోసం త‌హ‌త‌హ‌లాడుతున్నాడు. ప్ర‌స్తుతం రొమాంటిక్ అనే సినిమా చేస్తుండగా, ఇందులో అందాల హీరోయిన్ కేతిక శర్మ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ‘రొమాంటిక్’ చిత్రం అక్టోబర్ 29 విడుదల కాబోతోంది.

పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. రొమాంటిక్ సినిమాను అనిల్ పాడురి తెరకెక్కించారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను శుక్రవారం నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ ‘‘ఆకాష్‌లో తపన ఉంది. ఇంత మంది మధ్య తను అనుకున్నది చెప్పే ధైర్యం ఉంది. ఆకాష్‌ సినిమా పిచ్చి గురించి నాకు ఛార్మి చెబుతుంటారు. అన్ని సినిమాలూ నచ్చుతుంటాయి. నీలాంటివాళ్లు వందశాతం విజయవంతం కావాలి అని విజ‌య్ తెలియ‌జేశాడు.

ఆకాష్ మాట్లాడుతూ.. ‘రొమాంటిక్ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా? అని చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నాను. ఈ రెండు మూడేళ్లు ప్రాణం పెట్టి సినిమా చేశాం. ఇంతగా సపోర్ట్ చేసిన దర్శకుడు అనిల్‌కు థ్యాంక్స్. రమ్యకృష్ణ గారు ఈ చిత్రంలో ఓ స్పెషల్ రోల్ చేశారు. మా అందరికీ ఈ చిత్రం అవసరం కానీ.. ఈ సినిమాకు రమ్యకృష్ణ గారు అవసరం.

మా నాన్న గురించి ఎవరైనా బ్యాడ్ కామెంట్లు పెడితే తలపగలగొట్టాలని అనిపించేది. ఇక పూరి సినిమాలు ఎవరు చూస్తారు.. టైం అయిపోయిందని అందరూ అన్నారు. కానీ ఇస్మార్ట్ శంకర్‌తో ఫుల్ హై ఇచ్చారు. కెరీర్ అయిపోయింది అని అన్నవాళ్లకు నేను చెబుతున్నాను.. నీ యబ్బ కొట్టాడ్రా మా వాడు అనుకునేలా చేస్తా.

కాలర్ ఎగిరేసే మూమెంట్ ఇచ్చినందుకు మా నాన్నకు థ్యాంక్స్. జీవితంలో సక్సెస్ అవ్వడం ఫెయిల్ అవ్వడం కాదు.. మనం చేసే పనిని ఇష్టపడటం అని మా నాన్న చెప్పారు. కానీ నా విషయంలో అది సరిపోదు. బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఫెయిల్ అయితే కాస్త సానుభూతి చూపిస్తారేమో. కానీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నోడు ఫెయిల్ అయితే మనిషిలా కూడా చూడరు. నీ కొడుగ్గా పుట్టడం నా అదృష్టం. నేను కచ్చితంగా సక్సెస్ అవుతాను. ఈడు హీరో ఏంటి..కెరీర్ అయిపోయింది అనే మాటలు విన్నాను.

నేను నీ కొడుకుగా పుట్టడం నా అదృష్టం కానీ నుమ్ నా కొడుకు ఆకాష్ పూరి అని చెప్పుకునేలా చేస్తాను. ప్రతీ సినిమా మొదటి చిత్రం అనుకుని చేయమన్నావ్ కానీ ఇదే నా లాస్ట్ సినిమా అన్నట్టు చేస్తాను. ప్రాణం పెట్టి చేస్తాను. నా కెరీర్ అయిపోయిందని మాట్లాడుకున్న ప్రతీ ఒక్కరికి నేను చెబుతున్నా.. నో ఇట్స్ నాట్ ఓవర్. నిన్ను కాలర్ ఎగిరేసేలా చేస్తాను. అది ఎప్పుడు అవుతుందో చెప్పలేను. కానీ కచ్చితంగా చేస్తాను అని చాలా ఆవేశంగా మాట్లాడాడు ఆకాశ్.