Ajay devgan: అయ్యప్ప మాల ధ‌రించిన బాలీవుడ్ స్టార్ హీరో.. నిష్టగా పూజ‌లు

Ajay devgan: ద‌క్షిణాదిలో ఎక్కువ‌గా అయ్యప్ప మాల ధ‌రించ‌డం మ‌నం చూస్తుంటాం. అయ్య‌ప్ప స్వామికి మాల వేసుకుని ఇరుముడి తీసుకుని శ‌బ‌రి మ‌ల‌కు వెళ్లి ఆయ‌న్ని ద‌ర్శించుకునే భ‌క్తుల సంఖ్య ల‌క్ష‌ల్లో ఉంటుంది. ఇటీవ‌ల కాలంలో కేర‌ళ కంటే తెలుగు రాష్ట్రాల‌లో అయ్య‌ప్ప స్వామి మాల ధరించే వారి సంఖ్య పెరిగింది. సామాన్యులే కాదు సెల‌బ్రిటీలు సైతం మాల ధ‌రించి క‌ఠిన నియ‌మాలు ఆచ‌రిస్తున్నారు.

actor Ajay Devgn's Sabarimala temple darshan1
actor Ajay Devgn’s Sabarimala temple darshan1

మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్‌, నిర్మాత సురేష్ బాబు, ముర‌ళీ మోహ‌న్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, శ‌ర‌త్ బాబు త‌దిత‌రులు అయ్య‌ప్ప మాల‌ను ధ‌రిస్తుంటారు. ఇప్ప‌టి వ‌ర‌కు ద‌క్షిణాదికి చెందిన స్టార్స్ మాత్ర‌మే అయ్య‌ప్ప మాల‌ను ధ‌రించి హ‌రి హ‌ర సుతుడు అయ్య‌ప్ప‌ను కొలుస్తుంటారు. ఇప్పుడు ఈ లిస్టులోకి బాలీవుడ్ స్టార్ అజ‌య్ దేవ‌గ‌ణ్ కూడా చేరారు.

అజ‌య్ దేవ‌గ‌ణ్ అయ్య‌ప్ప మాల ధ‌రించ‌డ‌మే కాక శ‌బ‌రిమ‌ల వెళ్లి స్వామి వారికి ఇరుముడి చెల్లించి వ‌చ్చారు. ద‌క్షిణాదికి చెందిన జోతిష్యుడు బాలు మున్నంగి కార‌ణంగా అజ‌య్ దేవ‌గ‌ణ్ అయ్యప్ప దీక్ష‌ను తీసుకున్నారు. వెంక‌ట్ రెడ్డి అనే గురుస్వామి స్వ‌యంగా ముంబై వెళ్లి, అజ‌య్ దేవ‌గ‌ణ్ ఇంట్లోనే అయ్య‌ప్ప మాల ధార‌ణ చేశార‌ని స‌మాచారం. అయ్య‌ప్ప దీక్ష‌ను చేప‌ట్టి మాల‌ను ధ‌రించిన తొలి బాలీవుడ్ స్టార్ కూడా అజ‌య్ దేవ‌గ‌ణ్ కావ‌చ్చున‌ని అంద‌రూ అంటున్నారు.

ప్ర‌స్తుతం అజ‌య్ దేవ‌గ‌ణ్ అయ్య‌ప్ప మాల‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైర‌ల్‌గా మారాయి. ప్ర‌స్తుతం అజ‌య్ దేవ‌గ‌ణ్ బాలీవుడ్ నాట స‌క్సెస్ ఫుల్ స్టార్‌గా కొన‌సాగుతుండ‌గా, ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఇందులో అజ‌య్ దేవ‌గ‌ణ్ చాలా కీల‌క మైన పాత్ర‌లో న‌టించారు. స్వాతంత్ర పోరాటంలో బ్రిటీష్ వారిని ఎదిరించి అసువులు బాసే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో అజ‌య్ దేవ‌గ‌ణ్ క‌నిపించ‌బోతున్నారు.

actor Ajay Devgn's Sabarimala temple darshan1
actor Ajay Devgn’s Sabarimala temple darshan1

అజయ్ దేవగణ్ తెలుగు,తమిళ సినిమాలపైన మక్కువ చూపిస్తున్నారు. ఇప్పటికే తెలుగులో అల్లరి నరేష్ నాందీ సినిమా కథను తీసుకుని అందులో నటించడమే కాకుండా.. స్వయంగా నిర్మిస్తున్నారు అజయ్ దేవగణ్. తమిళ స్టార్ హీరో సూర్య నటించిన సింగం3 మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు సూర్య తమ్ముడు కార్తి నటించిన ఖైదీ సినిమాను కూడా హిందీలో రీమేక్ చేస్తున్నారు అజయ్ దేవగణ్.