Aishwarya Rajesh : ప్రభాస్ వల్ల కోట్లు నష్టపోయా.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు..!

NQ Staff - May 19, 2023 / 05:40 PM IST

Aishwarya Rajesh : ప్రభాస్ వల్ల కోట్లు నష్టపోయా.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు..!

Aishwarya Rajesh : తెలుగు అమ్మాయి అయిన ఐశ్వర్య రాజేశ్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె తెలుగులో కంటే కూడా ఎక్కువగా తమిళంలోనే వరుసగా సినిమాలు చేస్తోంది. ఇక తాజాగా ఆమె నటించిన మూవీ ఫర్హానా. ఈ మూవీ రిసెంట్ గా వచ్చి మంచి హిట్ టాక్ సంపాదించుకుంది. దీంతో మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు.

ఈ మూవీలో ఆమె ఫర్హానా అనే పాత్రలో అదరగొట్టేసింది. ఇది ఒక వేశ్య పాత్ర అని చెప్పుకోవాలి. ఇలాంటి పాత్రల్లో నటించాలంటే చాలా ధైర్యం కావాలి. ఎంతైనా ఇలాంటి పాత్ర చేసినందుకు ఐశ్వర్య ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. కాగా తాజాగా ఐశ్వర్య ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

నేను ఇప్పటి వరకు నటించిన సినిమాలు నాకు మంచి పేరును తీసుకువచ్చాయి. అందులో ముఖ్యంగా కౌసల్య కృష్ణమూర్తి సినిమాకు తమిళంలో మంచి హిట్ టాక్ వచ్చింది. తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఆ సినిమా వచ్చిన వారం రోజులకే ప్రభాస్ సాహో సినిమా రిలీజ్ అయింది.

Aishwarya Rajesh Sensational Comments Talking About Prabhas An Interview

Aishwarya Rajesh Sensational Comments Talking About Prabhas An Interview

మా సినిమాకు ప్రేక్షకులు పెరుగుతన్న సమయంలోనే ఆ మూవీ రావడంతో మా మూవీకి భారీ దెబ్బపడింది. దాంతో కలెక్షన్లు భారీగా తగ్గిపోయాయి. ప్రభాస్ లాంటి హీరో సినిమా వస్తుంది కదా.. మన సినిమాను వాయిదా వేద్దామని నిర్మాతలకు చెప్పాను. కానీ వారు వినలేదు. దాంతో కోట్లు నష్టపోయాం అంటూ చెప్పుకొచ్చింది ఐశ్వర్య.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us