Anchoring: పెళ్లిళ్లకు యాంకరింగ్ చేసిన ఆ స్టార్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

Anchoring: ఈ రోజు సినీ పరిశ్ర‌మ‌లో ఓ వెలుగు వెలుగుతున్న‌ స్టార్స్ అంద‌రు ఎన్నో క‌ష్టాలు ప‌డితే కాని ఈ స్థాయికి చేరుకోలేదు. మెగాస్టార్ చిరంజీవి నుండి మొద‌లు పెడితే నేడు యువ హీరోగా రాణిస్తున్న కార్తికేయ వ‌రకు ఎన్నో క‌ష్టాల‌ను అనుభ‌వించి ఈ స్థాయికి చేరుకున్నారు. ఓ పూట తిండి తిని ఆఫ‌ర్స్ కోసం స్టూడియోల వెంట చెప్పులు అరిగేలా తిరిగితే కాని ఇప్పుడు వారికి స్టార్ డం రాలేదు హీరోయిన్స్‌లోను అంతే.

Anchoring

స‌మంత ఒక‌ప్పుడు పెళ్ళిళ్ల ద‌గ్గ‌ర ప‌న్నీను జ‌ల్లేది. ఈ విష‌యాన్ని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది. అలానే హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కూడా చాలా క‌ష్ట‌పడి ఈ స్థాయికి చేరుకుంది. ఐశ్వ‌ర్య క‌ష్టాలు వింటే సినిమా క‌ష్టాలులానే ఉన్నాయి. ఎనిమదేళ్ల వయసులోనే తండ్రి చనిపోయారు. పదేళ్ల వయసులో పెద్ద అన్న కూడా మరణించారు. ఆ తర్వాత రెండో అన్న కూడా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో.. 15 ఏళ్ల వయసులోనే కుటుంబ బాధ్యతను మోయాల్సి వచ్చింది ఐశ్వర్య రాజేష్.

సూప‌ర్ మార్కెట్‌లో ప‌నుల‌కు వెళ్లిన ఐశ్వ‌ర్య రాజేష్ అప్పుడ‌ప్పుడు పెళ్లిళ్ల‌లో యాంక‌రింగ్ చేసింది. ఇందుకు వారు 500 రూపాయ‌లు ఇచ్చేవారు. వాటితోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. ఇక మెల్ల‌మెల్ల‌గా టీవీ సీరియ‌ల్స్‌లోకి అడుగుపెట్టిన ఈ భామ చిన్న చిన్న పాత్ర‌లు చేసి 1500 రూపాయ‌లు సంపాదించేది. అయితే పెద్ద న‌టుల‌కు భారీగా డ‌బ్బులు ఇస్తార‌ని తెలుసుకున్న ఈ అమ్మ‌డు ఆ రేంజ్‌కి వెళ్లాల‌ని ఎంత‌గానో క‌ల‌లు క‌నేద‌ట‌.

Anchoring

ఎలాగోలా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య ఫస్ట్ మూవీ ‘అవర్ గళ్ ఇవర్ గళ్’. ఆ తర్వాత ‘అట్టకత్తి’ అనే సినిమాలో నటించింది. ఎన్నో అవ‌మానాలు, అనేక క‌ష్టాలు ఎదుర్కొని ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేంజ్‌కి వెళ్లింది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు పవన్ కల్యాణ్ – రానా మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ లో రానా సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది ఐశ్వర్య. ఇలాంటి గాథ‌లు ఎంద‌రో న‌టీమ‌ణుల జీవితాలలోను ఉన్నాయి.