Aishwarya Rai: పారిస్ వీధుల్లో బ్లూ కుర్తాలో మెరిసిపోయిన ఐశ్వ‌ర్యరాయ్

Aishwarya Rai: ఐశ్వ‌ర్య‌రాయ్.. ఈ అమ్మ‌డి అందాల‌కు ప‌రవ‌శించిన వారు లేరు. మ‌న‌దేశంలో జ‌రిగే వేడుక‌ల‌లోనే కాక అంతర్జాతీయ వేదికలపై మెరుస్తూ మురిపిస్తుంటుంది. వయసు పెరిగినా చెక్కు చెదరని అందంతో ఐషూ అదరగొట్టేసింది. రెండేళ్లుగా మీడియాకు దూరంగా కోవిడ్, ఇతర సమస్యల కారణంగా ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు వేడుకలకు, మీడియాకు దూరంగా ఉండిపోయారు ఐష్‌.

 

ఇప్పుడిప్పుడే కరోనావైరస్ పరిస్థితులు మెరుగుపడటంతో మళ్లీ సినీ, ఫ్యాషన్ సెలబ్రిటీల సందడి మొదలైంది. అంతర్జాతీయ వేదికలపై ఫ్యాషన్ పరేడ్స్, అవార్డుల వేడుకల హంగామా ఊపందుకొన్నది. ఇలాంటి పరిస్థితుల మధ్య ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌ను ఘనంగా జరిపారు.ఈ వేడుక కోసం ఐశ్వర్యరాయ్ తన కుటుంబంతో కలిసి ప్యారిస్ వెళ్లారు. భర్త అభిషేక్ బచ్చన్, కూతురు ఆరాధ్య బచ్చన్‌ వెంట రాగా ఐశ్వర్య ఫ్యాషన్ వేడుకల్లో పాలు పంచుకొన్నారు.

తాజాగా ఐశ్వ‌ర్య‌రాయ్ బ్లూ క‌ల‌ర్ కుర్తాలో .. పారిస్ వీధుల్లో ద‌ర్శ‌న‌మిచ్చింది. రాహుల్ మిశ్రా ఆ దుస్తుల్ని డిజైన్ చేశారు. పారిస్ ఫ్యాష‌న్ వీక్‌లో పాల్గొంటున్న ఐశ్వ‌ర్య‌.. జీన్స్ ట్రౌజ‌ర్స్‌, హీల్స్‌లో క‌నిపించింది. లోరియ‌ల్ బ్రాండ్ అంబాసిడ‌ర్ అయిన బాలీవుడ్ స్టార్ ఈఫిల్ ట‌వ‌ర్ బ్యాక్‌గ్రౌండ్‌లో సాగిన ఆ వాక్‌లో ఐశ్వ‌ర్య వైట్ డ్రెస్సులో అట్రాక్ట్ చేసింది. దేశీ గ‌ర్ల్ త‌ర‌హాలో ఫోటోల‌కు ఆమె ఫోజులిచ్చింది.

ప్రపంచ దిగ్గజ హీరోయిన్ల నడుమ ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత గుర్తింపు పొందిన సెలబ్రిటీలు పాల్గొన్నారు. బ్రిటిష్ స్టార్ హెలెన్ మిర్రెన్, నటి, గయాని కామిలా కాబెల్లో, ఆస్ట్రేలియా నటి క్యాథరీన్ లాంగ్‌ఫోర్డ్, హౌటూ గెట్ అవే విత్ మర్డర్ ఫేమ్ అజా నోయామి కింగ్, హాలీవుడ్ నటి అంబర్ హార్డ్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ యాక్టర్ నికోలాజ్ కోస్టర్ వాల్డా తదితరులు పాల్గొన్నారు.