Aishwarya Rai: అందానికే అసూయ పుట్టిస్తున్న ఐశ్వ‌ర్య‌రాయ్..!

Aishwarya Rai: ఐశ్వ‌ర్య‌రాయ్.. ఈ పేరుకి పెద్ద‌గా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. దాదాపు రెండేళ్లుగా దేశం దాటి వెళ్ల‌ని ఐష్.. అంతర్జాతీయ వేదికలపై త‌ళుక్కున మెరిసింది. వయసు పెరిగినా చెక్కు చెదరని అందంతో ఐషూ అదరగొట్టేసింది. ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో పాలు పంచుకొన్న ఐశ్వర్య రాయ్ అందం ముందు ప్రపంచవ్యాప్తంగా పేరు గల ముద్దుగుమ్మల అందం వెలవెలబోయింది. భారీగా హాజరైన అగ్ర హీరోయిన్లు, టాప్ ఫ్యాషన్ మోడల్స్ ఐశ్వర్య రాయ్ ముందు తమ అందాలను ప్రదర్శించడానికి చాలా కష్టపడినట్టు తెలుస్తుంది.

Aishwarya Rai Latest Photoshoot Pics
Aishwarya Rai Latest Photoshoot Pics

కరోనావైరస్ పరిస్థితులు మెరుగుపడటంతో మళ్లీ సినీ, ఫ్యాషన్ సెలబ్రిటీల సందడి మొదలైంది. అంతర్జాతీయ వేదికలపై ఫ్యాషన్ పరేడ్స్, అవార్డుల వేడుకల హంగామా ఊపందుకొన్నది. ఇలాంటి పరిస్థితుల మధ్య ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌ను ఘనంగా జరిపారు. ప్యారిస్ ఫ్యాషన్ వీక్ ఉత్సవాలకు ఐశ్వర్యరాయ్ తన కుటుంబంతో కలిసి ప్యారిస్ వెళ్లారు. భర్త అభిషేక్ బచ్చన్, కూతురు ఆరాధ్య బచ్చన్‌ వెంట రాగా ఐశ్వర్య ఫ్యాషన్ వేడుకల్లో పాలు పంచుకొన్నారు.

Aishwarya Rai Latest Photoshoot Pics
Aishwarya Rai Latest Photoshoot Pics

ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఐశ్వర్య తన అంద చందాలు, గ్లామర్ లుక్, అలాగే డ్రస్సింగ్ స్టైల్‌తో ఆకట్టుకొన్నారు. ముంబైలో పాపులారిటీ ఉన్న రాహుల్ మిశ్రా రూపొందించిన దుస్తులను ధరించి అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటారు. ఐశ్వర్యనే కాకుండా అభిషేక్, ఆరాధ్య కూడా ఫ్యాషన్‌పరంగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఇలా ఫ్యాషన్ వీక్‌ను ప్యారిస్‌లో ఫ్యామిలీ అఫైర్‌గా మార్చేశారు.

Aishwarya Rai Latest Photoshoot Pics
Aishwarya Rai Latest Photoshoot Pics

ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో భాగంగా లీ డిఫైల్ లోరియల్ ప్యారిస్ 2021లో ఉమెన్ స్వియర్ స్ప్రింగ్ 2022 షోలో ఐశ్వర్యరాయ్ అదరగొట్టేసింది. శ్వేత వర్ణం దుస్తుల్లో ఆమె మిలమిల మెరిసిపోయింది. సహజసిద్దంగా మేకప్ చేసుకొని తన అందాలతో ఆకట్టుకొన్నది. తెల్లటి దుస్తులు ధరించిన ఐశ్వర్య..పెదాలకు ఎరుపు రంగు లిప్‌స్టిక్ పెట్టుకొని మరింత ఆకర్షణీయంగా కనిపించింది.

Aishwarya Rai Latest Photoshoot Pics
Aishwarya Rai Latest Photoshoot Pics

చాలా రోజులుగా ఇంటిపట్టునే ఉండిపోయిన ఐశ్వర్య, దర్శకుడు మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ మూవీ షూటింగ్, కరోనా కొనసాగుతుండగానే పూర్తి చేసింది. అయినా ఆమె ఫోటోలు ఎక్కడా పెద్దగా చక్కర్లు కొట్టలేదు. లాక్‌డౌన్స్‌ నేపథ్యంలో ఆమె విదేశాలకు కూడా ఇంతకాలం వెళ్లలేదు. దాంతో ఐష్ అభిమానులకి ఆమె దర్శనమే లేకుండా పోయింది.