Ahimsa Movie Review : అహింస మూవీ రివ్యూ..!
NQ Staff - June 2, 2023 / 02:54 PM IST

Ahimsa Movie Review : దగ్గుబాటి వారసుడు అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్న మూవీ అహింస. రానాను హీరోగా పరిచయం చేసిన తేజ ఇప్పుడు అభిరామ్ బాధ్యతలు తీసుకున్నాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు మొదటి నుంచి బాగానే ప్రమోషన్లు చేశారు. పైగా తేజ దగ్గరుండి ప్రమోషన్స్ బాధ్యతలు తీసుకున్నాడు. చాలా గ్యాప్ తర్వాత తేజ నుంచి వస్తున్న మూవీ కావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి నేడు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ ఏంటంటే..
రఘు(అభిరామ్), అహల్య చిన్ననాటి ప్రేమికులు. అయితే రఘు మొదటి నుంచి అహింసా వాదిగా ఉంటాడు. దాంతో అతన్ని ఎలా అయినా మార్చాలని అహల్య చాలా ప్రయత్నాలు చేస్తుంది. కానీ అతను ఎప్పుడూ ఆమె మాట వినడు. కానీ వారిద్దరి మధ్య లోతైన ప్రేమ ఉంటుంది. ఇలా సాగుతున్న వీరి జీవితాల్లో ఓ దిగ్భ్రాంతికరమైన సంఘటన జరుగుతుంది. ఇంతకీ ఆ ఘటన ఏంటి? దాని వల్ల వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? రఘు మనసు మార్చుకుని హింసామార్గం ఎంచుకుంటాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలే మిగతా కథ.
నటీనటుల పర్ఫార్మెన్స్..
తొలి సినిమా అయినప్పటికీ అభిరామ్ నటన బాగానే ఉంది. కొన్ని సన్నివేశాలు మినహాయిస్తే ఆయన అన్ని సీన్లలో బాగానే నటించాడని చెప్పుకోవచ్చు. ఇక గీతికా తివారి కూడా అంతో ఇంతో బెటర్ గానే నటించింది. ఆమె ఉన్న సన్నివేశాల్లో కొంత ఇంపాక్ట్ తీసుకొచ్చింది. రజత్ బేడీ, మనోజ్ టైగర్ తమ పాత్రల పరిధి మేరకు మెప్పించగా, సదా, రవి కాలే, కమల్ కామరాజు, కల్పలత, దేవీప్రసాద్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.
టెక్నికల్ పనితీరు..
తేజ చాలా అనుభవం ఉన్న దర్శకుడు. యూత్ ఫుల్ ఎంగేజింగ్ లవ్ స్టోరీలను చక్కగా ప్రజెంట్ చేయగలడు. కానీ ఆ అనుభవం ఈ సినిమాలో పెద్దగా కనిపించట్లేదు. కేవలం కొన్ని సీన్లు మినహా ఆశించిన స్థాయిలో సీన్లను తెరకెక్కించలేకపోయాడనే చెప్పుకోవాలి. పైగా కథలో కొత్తదనం ఏమీ లేదు. సీన్లు క్వాలిటీగా లేవు. మ్యూజిక్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. బీజీఎం పర్వాలేదు. ఎడిటింగ్ లోపాలు చాలా ఉన్నాయి. సినిమాటోగ్రాఫర్ పనితీరు అంతంత మాత్రంగానే ఉంది.

Ahimsa Movie Review
ప్లస్ పాయింట్లు..
నటీనటుల పర్ఫార్మెన్స్
చూడదగిన కొన్ని సీన్లు
మైనస్ పాయింట్లు..
కథలో బలం లేకపోవడం
బోరింగ్ గా అనిపించే సీన్లు
సెకండ్ హాఫ్ లో సాగదీత
చివరగా..
అహింస సినిమాను ఎంగేజింగ్ లవ్ స్టోరీగా మలచాలని దర్శకుడు తేజ ప్రయత్నించాడు. చాలా వరకు బోరింగ్ గా సినిమాను తీశాడు. అసలు ఒక సీన్ తర్వాత ఏం వస్తుందో ముందే ఊహించవచ్చు. కొన్ని సీన్లు ఓవర్ గా అనిపిస్తుంటాయి. అందుకే ఈ మూవీ ఆశించినంత ఫలితాన్ని అందుకోలేదు. ఈ మూవీని చూడాలంటే చాలా ఓపిక ఉండాలి.
రేటింగ్ః2/5