అక్కినేని మూడో తరం వారసుడు అక్కినేని అఖిల్ ఇప్పటికీ మూడు సినిమాలు చేసిన ఏ సినిమా మనోడికి మంచి విజయాన్ని అందించలేకపోయింది. త్వరలో అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం విడుదల కానుండగా, దీనిపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. ఇక కొద్ది రోజులుగా సురేందర్ రెడ్డితో అఖిల్ ఓ సినిమా చేయనున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆ మధ్య దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా చేశారు. ఇక ఈ రోజు అఖిల్ బర్త్ డే సందర్బంగా ఫస్ట్ లుక్ విడుదల చేసి ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చారు.
అఖిల్- సురేందర్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో సీక్రెట్ ఏజెంట్‌గా ఓ మిషన్‌ను టేకప్ చేయనున్నారట అఖిల్.ఈ సినిమాకు ఏజెంట్ అనే టైటిల్ ఫిక్స్ చేసిన దర్శకుడు ఇందులో అఖిల్‌ను కొత్తగాప్రజెంట్ చేశాడు. ఇప్పటి వరకు కూల్ లుక్‌లో కనిపించిన అఖిల్ ప్రస్తుతం చాలా ఊరమాస్‌గా కనిపిస్తున్నాడు. తనను ఇలా డిఫరెంట్‌గా మార్చినందుకు సురేందర్ రెడ్డికు కృతజ్ఞతలు తెలియజేశాడు అఖిల్. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. కాగా, అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా వస్తున్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందగా, ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు.