Adivi Sesh: సెన్సేషన్ ఆఫ్ టాలీవుడ్..ఈ 3 సినిమాలతో 40 కోట్ల మార్కెట్ పెంచుకుంటున్న హీరో

Adivi Sesh: తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. ఏ ఇండస్ట్రీలో అయినా కూడా బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ అవ్వడం అంటే చిన్న విషయం కాదు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడమే కరెక్ట్. ఇదేదో నోటి లెక్క కాదు.. కొందరు హీరోలు చేసి నిరూపించారు కూడా. తెలుగులో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన విజయ్ దేవరకొండ, నాని లాంటి హీరోలు ఎక్కువగా కాన్సెప్టు సినిమాలే చేసారు. ఇప్పుడు అడవి శేష్ కూడా ఇదే చేస్తున్నాడు.

Adivi Sesh Sensation of Tollywood
Adivi Sesh Sensation of Tollywood

తాజాగా ఈయన మూడు సంచలన సినిమాలతో వస్తున్నాడు. కాన్సెప్ట్ సినిమాలు చేస్తున్న హీరోలకు విజయాలు కూడా బాగానే వస్తున్నాయి. రొటీన్ రెగ్యులర్ సినిమాల కంటే అలాంటి కథలతోనే విజయం అందుకుంటున్నాడరు కొందరు హీరోలు.. అయితే స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత కమర్షియల్ జోనర్ లోకి వెళ్తున్నారు. కానీ అడవి శేష్ మాత్రం అలా కాదు. ముందు నుంచి కూడా విభిన్నమే తన దారి అంటున్నాడు.

ఒక్కో సినిమాతో తన మార్కెట్ పెంచుకుంటున్నాడు ఈయన. శేష్ నుంచి సినిమా వస్తుందంటే కచ్చితంగా అది హిట్ అనే నమ్మకానికి వచ్చేసారు ఆడియన్స్ కూడా. అంతగా తన సినిమాలతో అందరిలోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదట్లో పంజా, బాహుబలి, బలుపు లాంటి సినిమాలలో ప్రతినాయకుడిగా ఇండస్ట్రీకి వచ్చినా కూడా ఇప్పుడు లీడింగ్ హీరోగా మారిపోయాడు. లైన్ లో సెన్సేషనల్ ప్రాజెక్టులు సెట్ చేసాడు అడవి శేష్.

ఇప్పటికే క్షణం, గూఢాచారి, ఎవరు లాంటి విజయాలతో అడవి శేష్ తన మార్కెట్ భారీగానే పెంచుకున్నాడు. ఇప్పుడు మరో మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు ఈయన. అందులో మేజర్ అన్నింటికంటే ముందుంది. మహేష్ బాబు ఈ సినిమాను నిర్మిస్తుండటం గమనార్హం. గూఢచారి దర్శకుడు శశికిరణ్ తిక్కా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియన్ ప్రాజెక్టుగా మేజర్ వస్తుంది. మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా వస్తుంది. మరోవైపు గూఢచారి 2 సినిమాలో కూడా నటిస్తున్నాడు అడవి శేష్.

ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిస్తున్నాడు ఈయన. దీనికి స్క్రిప్ట్ కూడా శేష్ అందిస్తున్నాడు. ఈ మధ్యే నాని నిర్మాతగా హిట్ 2 సినిమాను కూడా మొదలు పెట్టాడు అడవి శేష్. ఇందులో పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నాడు. ఇది కూడా పాన్ ఇండియన్ స్థాయిలో చేయాలని చూస్తున్నాడు నాని. ఏదేమైనా కూడా ఈ మూడు సినిమాలతో అడవి శేష్ మార్కెట్ కనీసం 30 నుంచి 40 కోట్ల వరకు చేరుతుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. కచ్చితంగా రాబోయే రోజుల్లో అడవి శేష్ తన రేంజ్ మరింత పెంచుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.