ADIVI SESH: కోవిడ్ సమయంలో మానవత్వాన్ని చూపిస్తున్న యువ హీరోలు.. నిన్న సందీప్ కిషన్, నేడు అడివి శేష్
Priyanka - May 4, 2021 / 04:58 PM IST

కరోనా సంక్షోభంలో ఎన్ని దారుణమైన సంఘటనలు చూడాల్సి వస్తుందని ఎవ్వరు ఊహించి ఉండరు. కరోనాతో పేరెంట్స్ చనిపోయి పిల్లలు అనాథలుగా మారడం, తిండి తప్పలు లేక జీవచ్చవాలులా బతకడం, గూడు దొరక్క నానా ఇబ్బందులు పడడం వంటి సంఘనలు ఎన్నో చూస్తున్నాం. అయితే వీరికి తమ వంతు సాయం అందించేందుకు సినీ ప్రముఖులు ముందుకు వస్తుండడం శుభ పరిణామాం. మంగళవారం రోజు సందీప్ కిషన్ కరోనా వలన తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రెండు నెలల పాటు తాను అండగా ఉంటానని ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇక ఈ రోజు అడివి శేష్ కోవిడ్ పేషెంట్స్ దాహర్తి తీర్చాడు. హైదరాబాద్లోని కింగ్ కోటి ఆసుపత్రిలో కరోనా బాధితులు చాలా మంది చికిత్స తీసుకుంటున్నారు. పేషంట్లు, వైద్యులు, ఇతర సిబ్బంది మొత్తం కలిసి 300 మంది వరకు ఆసుపత్రిలో ఉన్నారు. అయితే వీరికి తాగు నీరు కొరత ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న అడివి శేష్ వెంటనే స్పందించి 850 లీటర్ల మినరల్ వాటర్ బాటిళ్లను ఆసుపత్రికి పంపారు. శేష్ చేసిన ఈ పని వలన 300 మందికి సకాలంలో మంచి నీరు అందింది. భవిష్యత్ లో ఏ సాయం కావలన్నా కూడా నన్ను సంప్రదించండని ఆసుపత్రి వారికి చెప్పారట అడివి శేష్. ఈ హీరో చేసిన సాయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్.