Adivi Sesh: హైద‌రాబాదీ అమ్మాయితో ప్రేమ‌లో ప‌డ్డ యంగ్ హీరో

Adivi Sesh: గ‌త ఏడాది నుండి టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి చెందిన హీరో, హీరోయిన్స్ ఒక్కొక్క‌రుగా పెళ్లి పీట‌లెక్కుతున్నారు. క‌రోనాని కూడా లెక్క చేయ‌కుండా రానా, నిఖిల్,నితిన్, కాజ‌ల్ అగ‌ర్వాల్, నిహారిక వంటి వారు పెళ్లి పీట‌లెక్కారు. ఇక ఈ ఏడాది కూడా కొంద‌రు ప్ర‌ముఖులు పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో యంగ్ హీరో అడివి శేష్ త‌న ప్రేమ వ్య‌వ‌హారం బ‌య‌ట‌పెట్టాడు. ఓ హైదరాబాదీ అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు అంగీకరించాడు. కాకపోతే ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని పేర్కొన్నాడు.

Adivi Sesh

ప్ర‌స్తుతానికి ఈ విష‌యం సీక్రెట్ అని చెబుతున్న అడవి శేష్ ప్రేయ‌సి ద‌గ్గ‌ర ప‌ర్మీష‌న్ తీసుకోలేద‌ని, అనుమ‌తి వ‌చ్చాక చెబుతాన‌ని అంటున్నాడు. మ‌రి అడ‌వి శేష్ ప్రేమించిన అమ్మాయి ఇండ‌స్ట్రీకి సంబంధించిన అమ్మాయా లేదంటే ప‌రిచ‌యం ఉన్న వ్య‌క్తా అన్న‌ది రానున్న రోజుల‌లో తేల‌నుంది. క‌రోనా ప‌రిస్థితులు పూర్తిగా స‌ద్దుమ‌ణిగాక అడివి శేష్ పెళ్లి చేసుకోనున్నాడ‌ని విశ్వ‌సన‌య వ‌ర్గాల స‌మాచారం.

వైవిధ్య‌మైన క‌థ‌ల‌ను ఎంపిక చేసుకుంటూ వెళుతున్న అడ‌వి శేష్ కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాలు చేశాడు. ప్రస్తుతం ‘మేజర్‌’, ‘హిట్‌ 2’ సినిమాలు చేస్తున్నాడు. 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆదారంగా మేజ‌ర్ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు ఆక‌ట్టుకున్నయి. ఈ సినిమాకి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తుండగా.. తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ త‌దిత‌రులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మిస్తున్నాయి.

Adivi Sesh

అడవి శేష్ న‌టుడిగానే కాదు మంచి సేవా త‌త్ప‌ర‌త ఉన్న వ్య‌క్తిగా అభిమానుల మ‌న‌సులు గెలుచుకుంటున్నాడు. ఇటీవ‌ల కోవిడ్‌ పేషెంట్లు చికిత్స పొందుతున్న కోఠి ప్రభుత్వ ఆస్పత్రిలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు. ఎవరికి ఇబ్బందులు క‌ల‌గొద్ద‌ని సొంత ఖర్చుతో వాటర్‌ ప్యూరిఫికేషన్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయించి అంద‌రి మ‌న‌సులు గెలుచుకున్నారు.