Adivi Sesh: గుడ్ న్యూస్.. కోలుకొని ఇంటికి చేరుకున్న యంగ్ హీరో

Adivi Sesh: క‌రోనా మొద‌లైన‌ప్ప‌టి నుండి టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ప‌రిస్థితులు ఏం క‌లిసి రావ‌డం లేదు. ఒక వైపు వ్యాపార ప‌రంగా న‌ష్టాలు మ‌రో వైపు ప‌లువురు ప్రముఖులు అనారోగ్యం బారిన ప‌డ‌డంలేదంటే తుది శ్వాస విడిచి ప్రేక్ష‌కుల‌ని శోక సంద్రంలో మునిగేలా చేస్తున్నారు.ఇటీవ‌ల క్ష‌ణం, గూఢ‌చారి, ఎవ‌రు చిత్రాల‌తో హీరోగా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న హీరో అడివిశేష్ అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరారు.

Adivi Sesh discharged from Hospital
Adivi Sesh discharged from Hospital

క‌రోనా వ‌ల‌న ఆయ‌న సినిమాషూటింగ్ ఆగ‌గా, త్వ‌ర‌లో స్టార్ట్ చేయాల‌ని అనుకుంటూ ఉండ‌గా మేజర్ టీమ్‌కు షాక్ తగిలింది. అడివిశేష్‌కు డెంగ్యూ జ్వరం రాగా, ర‌క్తంలోని ప్లేట్‌లెట్స్ ప‌డిపోయాయి. సెప్టెంబ‌ర్ 18 నుంచి హాస్పిట‌ల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. శేష్ ఆరోగ్యాన్ని డాక్ట‌ర్స్ ప‌ర్య‌వేక్షిస్తూ వ‌చ్చారు. తాను కోలుకొని ఇంటికి చేరుకున్న విష‌యాన్ని అడివి శేష్ తెలిపారు. . తన ట్విట్టర్ ఖాతాలో.. ఇంటికి తిరిగి వచ్చాను.. విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు.

26/11న ఉగ్ర‌దాడిలో ప్ర‌జల ప్రాణాల‌ను కాపాడ‌టానికి అశువులు బాసిన మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని మేజ‌ర్ సినిమా చేస్తున్నారు అడివి శేష్‌. ఈ సినిమాను సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ త‌న జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ఏ ప్ల‌స్ ఎస్ మూవీస్, సోనీ పిక్చ‌ర్స్ ఫిల్మ్స్ ఇండియా వారి స‌హకారంతో నిర్మిస్తున్నారు. శ‌శి కిర‌ణ్ తిక్క ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. స‌యీ మంజ్రేక‌ర్‌, శోభితా దూళిపాళ‌, ప్ర‌కాశ్‌రాజ్‌, ముర‌ళీశ‌ర్మ‌, రేవ‌తి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

‘గూఢచారి’కి సీక్వెల్‌గా ‘గూఢచారి 2’ చేయనున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. అలాగే ‘హిట్‌’కు సీక్వెల్‌గా రూపొందుతున్న ‘హిట్‌2’లో శేష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌గా కనిపిస్తారట. ‘హిట్‌’ తొలి భాగాన్ని డైరెక్ట్‌ చేసిన శైలేష్‌ కొలనుయే ‘హిట్‌ 2’ను కూడా డైరెక్ట్‌ చేయనున్నారు.