Adivi Sesh And Supriya : అడివి శేష్, నాగార్జున మేన కోడలు సుప్రియ.. పెళ్ళి పీటలెక్కబోతున్నారా.?
NQ Staff - December 29, 2022 / 10:46 AM IST

Adivi Sesh And Supriya : అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెరంగేట్రం చేసిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతోనే హీరోయిన్గా తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాత ఆమె హీరోయిన్గా కొనసాగలేక పోయింది.
ప్రస్తుతం నిర్మాతగా మారి, తిరిగి సినిమాల్లోనూ నటించాలనే ఆలోచనతో వుంది సుప్రియ. అయితే, సుప్రియ పేరు మరోరకంగా వార్తలోకెక్కుతోంది.
అడివి శేష్ – సుప్రియ.. అసలేం జరుగుతోంది.?
యంగ్ హీరో, విలక్షణ నటుడు అడివి శేష్, సుప్రియ గత కొంతకాలంగా రిలేషన్లో వున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయమై ఇంతవరకు ఇరు వైపుల నుంచీ ఎలాంటి ఖండనా లేదు.
తాజాగా అడివి శేష్.. అక్కినేని ఇంట జరిగిన క్రిస్మస్ సంబరాల్లో కనిపించాడు.. అదీ సుప్రియతో కలిసి ఫొటోల్లో కనిపిస్తున్నాడు అడివి శేష్.
దాంతో, ఇద్దరి మధ్యా ఏదో జరుగుతోందన్న విషయం నిజమేననీ, అయితే ఆ బంధాన్ని అధికారికంగా ప్రకటించేందుకే ఏదో ఇబ్బంది ఎదురవుతోందనీ, ఆ ఇబ్బంది ఏంటి.? వీరి బంధం బహిర్గతమవడానికి అడ్డుపడుతున్న శక్తులేంటి.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.