Adipurush : ఆదిపురుష్‌ నిర్మాతలు కోట్ల రూపాయలు తిరష్కరించారు

NQ Staff - June 7, 2023 / 11:24 PM IST

Adipurush : ఆదిపురుష్‌ నిర్మాతలు కోట్ల రూపాయలు తిరష్కరించారు

Adipurush : ప్రభాస్ హీరోగా రూపొందిన ఆదిపురుష్‌ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా తిరుపతిలో జరిగిన విషయం తెలిసిందే. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి నిర్మాతలు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా సమాచారం అందుతుంది.

రెండు నుండి మూడు కోట్ల రూపాయల బడ్జెట్తో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని భావించినప్పటికీ అది కాస్త భారీగా పెరిగి పోయింది. ప్రముఖ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ అయిన శ్రేయాస్ మీడియా ఈ ఈవెంట్ ని నిర్వహించడం జరిగింది. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ యొక్క బాధ్యతలను చూసుకున్నాడు.

ఇక ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి శ్రేయాస్ మీడియా వారు ఎక్కువగా స్పాన్సర్స్ తీసుకొస్తారు. కానీ ఆదిపురుష్‌ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి స్పాన్సర్స్ వద్దంటూ చిత్ర నిర్మాతలు పేర్కొన్నారట. దాంతో ప్రతి రూపాయి కూడా నిర్మాతలు పెట్టుకోవాల్సి వచ్చింది.

ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎక్కువ శాతం నిర్మాతలు స్పాన్సర్స్ ని తీసుకుంటారు, కానీ ఆదిపురుష్ మేకర్స్ మాత్రం నాలుగు కోట్ల రూపాయలు సొంతంగా ఖర్చు చేసి ఈ భారీ ఈవెంట్ నిర్వహించడం జరిగింది.

ఒకవేళ స్పాన్సర్స్ కి ఓకే చెప్పి ఉంటే ఆ నాలుగు కోట్ల రూపాయలు మిగిలేవి అంటూ శ్రేయాస్ మీడియా వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి 550 కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందిన సినిమాకు నాలుగు కోట్ల రూపాయల రీ రిలీజ్ ఈవెంట్ ఖర్చు అనేది పెద్ద మొత్తమేం కాదు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us