Adipurush Movie Review : ఆదిపురుష్ మూవీ రివ్యూ..!
NQ Staff - June 16, 2023 / 09:34 AM IST

Adipurush Movie Review : గత రెండేండ్లుగా ఆదిపురుష్ గురించి వింటూనే ఉన్నాం. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ మొదటిసారి రాముడిగా నటిస్తున్న మూవీ ఇది. పూర్తిగా ఈ జనరేషన్ ను ఆకట్టుకునే విధంగా ఓం రౌత్ ఈ సినిమాను తీశాడని ఇప్పటికే వచ్చిన టీజర్లు, ట్రైలర్లు నిరూపించాయి. కృతిసనన్ సీతగా ఇందులో నటించింది. భారీ ఎత్తున ప్రమోషన్లు కూడా చేశారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ..
ఆదిపురుష్ సినిమాను రామాయణంలోని అరణ్యకాండ భాగాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. ఇక్కడ సీతను రావణుడు అపహరించుకుపోయినప్పటి నుంచి.. రాముడు సీతను తీసుకురావడం, రావణుడితో యుద్దం లాంటివి ఈ సినిమాలో చూపించారు. ఇందులో రాముడు, సీత, రావణుడికి వాడే పేర్లు వేరే కానీ.. ఇది పూర్తిగా రామాయణం ఆధారంగా తీసిందే.
నటీనటుల పర్ఫార్మెన్స్..
రాముడి పాత్ర చేయాలంటే చాలా క్రమశిక్షణ ఉండాలి. అది ప్రభాస్ పుష్కలంగా చూపించాడు. ఆయనలో రాముడి పాత్ర చేయగల సత్తా ఉందని నిరూపించుకున్నాడు. అమాయకత్వం, అంతర్లీనంగా ప్రశాంతత ఇవన్నీ ఆయన హావభావాల్లో పలికించాడు. ఇందులో ప్రభాస్ లుక్స్ ఒక యోధుడిలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రావణుడితో పోరాటఘట్టంతో మనకు రాముడే కనిపిస్తాడు. అంతగా పర్ఫార్మెన్స్ చేసి ఊపించాడు ప్రభాస్. ఎమోషనల్ సీన్స్ లో ప్రభాస్ అద్భుతంగా నటించింది.
ఇక సీత పాత్రలో కృతిసనన్ అద్దినట్టు ఉంది. జానకి పాత్రకు ఉండాల్సిన లక్షణాలను ఆమె చూపించింది. కృతి సనన్ ఇందులో పాత్రకు ప్రాణం పోసింది. కానీ సీత పాత్ర అంటే కృతిసనన్ అనేంత గుర్తింపు మాత్రం ఆమె తెచ్చుకోలేకపోయింది. ఇక సైఫ్ అలీఖాన్ లంకేశ్ అలియాస్ రావణుడిగా మాస్ విలన్ గా కనిపించాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇది రావణుడి పాత్రకంటే కాస్త భిన్నంగా అనిపిస్తుంది. అసలు రావణుడికి ఉండాల్సిన లక్షణాలు కొంత మిస్ అయ్యాయనే చెప్పుకోవాలి. సైఫ్ పాత్ర రావణుడి పాత్రలాగా మనకు అనిపించదు.

Adipurush Movie Review
ఇక లక్ష్మణుడిగా నటించిన సన్నీ సింగ్ ఎందుకో వందశాతం న్యాయం చేయలేదని అనిపిస్తుంది. అతను ఇందులో కాస్త నీరసంగా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. అతనికి స్క్రీన్ టైమ్ ఎక్కువగా ఉన్నా దాన్ని వినియోగించుకోలేకపోయాడు. ఇక హనుమంతుడిగా నటించిన దేవదత్త దేవదత్త నాగే నటన బాగుంది. మూవీ వెళ్తున్న కొద్దీ అతని నటన అబ్బురపరుస్తుందనే చెప్పుకోవాలి. మిగతా పాత్రలు పర్వాలేదనిపించారు.
టెక్నికల్ గా ఎలా ఉందంటే..
అజయ్-అతుల్, సాచేత్-పరంపర మ్యూజిక్ ఆదిపురుష్ కు ప్రాణం పోశాయి. ముఖ్యంగా జై శ్రీరామ్ పాట సినిమాను ఎలివేట్ చేయడంలో బాగా ఉపయోగపడింది. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ట్రెండ్ ప్రకారం చాలా లౌడ్ గా ఉంది. కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్ ఎఫెక్ట్స్ అతని పనితనాన్ని చూపిస్తున్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది. ఇక సినిమాకు అతిపెద్ద పాయింట్ విఎఫ్ఎక్స్. కొన్ని సీన్లలో ఏదో కార్టూనిష్ గా అనిపించినా చాలా వరకు బాగానే కవర్ చేశారు.
ప్లస్ పాయింట్లు..
నటీనటుల పర్ఫార్మెన్స్
మొదటి భాగం
ఆకట్టుకునే మ్యూజిక్

Adipurush Movie Review
మైనస్ పాయింట్లు..
సీన్ల సాగదీత
అర్థం లేని రావణుడి పాత్ర
వీఎఫ్ ఎక్స్ సీన్లు
చివరగా..
రామాయణం లాంటి కథను తెరమీద ఈ తరానికి నచ్చే విధంగా తీయాలని ఓం రౌత్ బాగానే కష్టపడ్డాడు. కానీ వందశాతం సక్సెస్ కాలేకపోయాడనే చెప్పుకోవాలి. ఏదేమైనా ఆదిపురష్ ఒక విజువల్ ఎఫెక్ట్. విఎఫ్ ఎక్స్ ను బ్యాలెన్స్ చేయడంలో బాగానే ఆకట్టుకున్నాడు ఓం రౌత్. ఒక రకంగా ఆదిపురుష్ చూడదగిన చిత్రమే.
రేటింగ్ః2/75