Adipurush Movie : ఆదిపురుష్‌ కోసం ఎవరు ఎంత తీసుకున్నారో తెలుసా..?

NQ Staff - June 15, 2023 / 09:56 AM IST

Adipurush Movie : ఆదిపురుష్‌ కోసం ఎవరు ఎంత తీసుకున్నారో తెలుసా..?

Adipurush Movie : ఆదిపురుష్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మేనియా కనిపిస్తోంది. ఎందుకంటే ఇండియాలోనే టాప్ హీరోగా పేరున్న ప్రభాస్ ఇందులో నటిస్తున్నారు. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఓం రౌత్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి ఇండియా వ్యాప్తంగా మంచి ఆదరణ వస్తోంది.

ఇందులో రాముడిగా ప్రభాస్ నటించారు. ఇక రావణుడిగా సైఫ్ అలీఖాన్ చేశారు. సీతగా కృతిసనన్ నటించింది. అయితే ఈ మూవీ ఈ నెల 16న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం ఎవరు ఎంత తీసుకున్నారనే టాక్ జోరుగా నడుస్తోంది. ఈ సినిమాకు కృతిసనన్ దాదాపుగా రూ.3 కోట్లు తీసుకున్నారు.

ఇక లక్ష్మణుడిగా నటించిన సన్నీ సింగ్ రూ.1.5 కోట్లు తీసుకున్నారు. ఆయన కెరీర్ లోనే ఇది హయ్యెస్ట్. రావణుడిగా నటించిన సైఫ్‌ అలీఖాన్ బాగానే తీసుకున్నాడని తెలుస్తోంది. ఆయన ఈ సినిమా కోసం ఏకంగా ఊ.12 కోట్లు తీసుకున్నారు. దర్శకుడు ఓం రౌత్ రూ.35 కోట్లు తీసుకున్నారు.

ఇక అందరికంటే ఎక్కువగా ప్రభాస్ ఆదిపురుష్ సినిమా కోసం తీసుకున్నారు. ఆయన ఈ సినిమా బడ్జెట్ లో నాలుగో వంతు తీసుకున్నారు. రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల దాకా తీసుకున్నాడు ప్రభాస్. కచ్చితంగా ఇంత తీసుకున్నారనే సమాచారం లేకపోయినప్పటికీ, ఆయన రెమ్యూనరేషన్ ఈ మధ్యలో ఉంటుందని అంటున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us