Adipurush Movie : ఆదిపురుష్ తొలిరోజు కలెక్షన్లు.. బాక్సాఫీస్ బద్దలు కొట్టిన ప్రభాస్..!
NQ Staff - June 17, 2023 / 10:53 AM IST

Adipurush Movie : ప్రభాస్ కు ఉన్న మార్కెట్ మరే హీరోలకు లేదనేది వాస్తవం. ఆయన సినిమాలకు జరుగుతున్న బిజినెస్ చూస్తేనే ఈ విషయం అర్థం అవుతుంది. ఒక్కో సినిమాను వందల కోట్లతో తీస్తున్నారు. తెలుగులో ఏ హీరోలకు కూడా ఈ స్థాయి బడ్జెట్ లో సినిమాలు చేయట్లేదు. కానీ కేవలం ప్రభాస్ కు మాత్రమే ఇది సాధ్యం అవుతోంది.
ఇక తాజాగా ఆయన నటించిన ఆదిపురుష్ మూవీ నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ మూవీపై భారీ అంచనాల ఉన్నాయి. దాంతో ఈ మూవీ కోసం ప్రేక్షకులు భారీగా థియేటర్లకు పరుగులు తీశారు. పైగా రామాయణం ఆధారంగా వస్తుండటంతో భారీ స్పందన వచ్చింది. ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టింది.
తొలిరోజు ఈ సినిమా హిందీలో రూ.50 కోట్లు కొల్లగొట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో రూ.80 కోట్ల వరకు వసూలు చేసింది. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా చెప్పాలంటే రూ.140 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు వసూలు చేసింది ఈ సినిమా. హిందీలో ఇప్పటి వరకు పఠాన్ తర్వాత ఆ స్థాయిలో వసూలు చేసింది కేవలం ఆదిపురుష్ సినిమా మాత్రమే.
ఇప్పుడు వీకెండ్ కాబట్టి బాగానే వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. కొన్ని చోట్ల పాజిటవ్ టాక్ వస్తే.. మరికొన్ని చోట్ల నెగెటివ్ టాక్ వస్తోంది. ఏదేమైనా మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ను రీచ్ అవుతుందా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిందే.