Bahubali : బాహుబలిని మించిన బడ్జెట్ ఆదిపురుష్ లో కేవలం ఆ ఒక్కదానికే..?

Bahubali : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి బాహుబలి సినిమాతో వచ్చిన క్రేజ్ ఏకంగా పాన్ ఇండియన్ రేంజ్ లో వచ్చేసింది. ఈ సినిమాలో ప్రభాస్ రెండు పాత్రల్లో నటించిన విధానం దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగాను విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఇక ఈ సినిమాకి రాజమౌళి ఎక్కువ బడ్జెట్ వీఎఫెక్స్ కే ఖర్చు చేశాడు. హాలీవుడ్ సినిమాని మించిన విధంగా బాహుబలి సినిమాని రాజమౌళి తయారు చేశాడు. ఈ సినిమాలో ఉన్న గ్రాఫిక్స్ అండ్ వీఎఫెక్స్ కి అన్నీ సినిమా ఇండస్ట్రీలలోని ప్రముఖులందరూ ప్రశంసించారు.

adipurush-budget-exceeds-bahubali-budget
adipurush-budget-exceeds-bahubali-budget

అయితే ప్రభాస్ తాజాగా నటిస్తున్న బాలీవుడ్ స్ట్రైట్ సినిమా ఆది పురుష్ కి ఇప్పుడు మరో లెవల్ లో ఖర్చు చేస్తున్నారట. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే సినిమాకి కేటాయించిన బడ్జెట్ లో 60 శాతం వీఎఫెక్స్ కి ఖర్చు చేస్తున్నట్టు ముంబై మీడియాలో ప్రచారం అవుతోంది. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడిగా సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటిస్తున్నారు. ఇక సీత్ర పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్, లక్ష్మణుడుగా సన్నీ సింగ్ నటిస్తున్నాడు. ఇంత భారీ కాన్వాయిస్ ఉన్న ఈ సినిమా గ్రాఫిక్స్ ప్రధానంగా సాగుతుంది.

Bahubali : 2022 ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా ఆదిపురుష్ రిలీజ్ కాబోతోంది.

రామాయణం ఇతిహాసం నుంచి ఆదిపురుష్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓం రౌత్. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2022 ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా ఆదిపురుష్ రిలీజ్ కాబోతోంది. కాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సలార్ అన్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ని తెరకెక్కిస్తున్నాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కూడా వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ కానుంది.

Advertisement