Anasuya Bharadwaj: అనసూయ గ‌ర్భ‌వ‌తా.. పాప కోసం ట్రై చేస్తుందా?

Anasuya Bharadwaj: సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ నిత్యం వార్త‌ల‌లో నిలిచే అందాల యాంక‌ర్ అన‌సూయ‌. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు సినిమాలు, టీవీ షోస్‌తో అల‌రిస్తూ సోష‌ల్ మీడియాలోను సంద‌డి చేస్తుంది. ఎప్పటికప్పుడు తన జబర్దస్త్ అందాలతో కవ్విస్తూనే జనాల్లో హాట్ టాపిక్ అవుతుండటం ఆమె నైజం. ఎవ‌రెన్ని కామెంట్స్ చేసిన అన‌సూయ త‌న‌దైన శైలిలో త‌న ప‌ని చేసుకుంటూ పోతుంది.

Adhire Abhi Sensational Comments on Anasuya Bharadwaj
Adhire Abhi Sensational Comments on Anasuya Bharadwaj

అన‌సూయ ప్ర‌స్తుతం మూడో ప్రెగ్నెన్సీ విషయంపై వార్త‌ల‌లోకి ఎక్కింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న అనసూయ.. ఇప్పటికే ఇద్దరు పిల్లలకు తల్లి. ఆ మ‌ధ్య ఓ ఇంట‌ర్వ్యూలో తనకు మూడో సంతానం కనాలని ఉందని పేర్కొని షాకిచ్చింది. ”నాకు ఇప్పుడు 35 ఏళ్లు. 40 సంవత్సరాలు వచ్చాక మరోసారి తల్లి కావాలని అనుకుంటున్నా. ఈ సారి నాకు పాపే కావాలి. తన కోసం నా సమయాన్నంతా కేటాయిస్తాను” అని చెప్పింది.

మధురమైన అనుభూతి. దానిగురించి మాట్లాడేందుకు నాకు ఎలాంటి మొహమాటం లేదు. టైం కుదిరినప్పుడు అమ్మాయిని కనాలని ఉంది అని అనసూయ తెలిపింది. తాజాగా జ‌బ‌ర్ధ‌స్త్‌కి సంబంధించి ప్రోమో విడుద‌ల కాగా, ఈ ప్రోమోలో అదిరే అభి.. అనసూయ గర్భవతి అయినట్లు బిల్డప్ ఇస్తూ కామెడీ డైలాగ్స్ పేల్చాడు. ‘టైంకి తిను.. జాగ్రత్తగా ఉండు.. పులుపు తినాలనిపిస్తే నేను మామిడి కాయలు పంపిస్తా’ అని అంటాడు. దానికింకా టైం ఉందిలే అని అనసూయ సమాధానం ఇస్తుంది.

ఏంటి అనసూయ మళ్ళీ నెల తప్పిందా అని పక్కనే ఉన్న అమ్మాయి అడుగుతుంది.. దీనికి అభి సెప్టెంబర్ నెల అందరికీ 9వ నెలే కదా అని ఫన్నీగా బదులిస్తాడు. ఇది సెప్టెంబర్ నెల.. అంటే అందరికీ తొమ్మిదో నెలే కదా’ అంటూ లాజిక్ ప్లే చేసింది అనసూయ. అయితే ఈ సీన్ చూసిన జనం మాత్రం అనసూయ తన మూడో ప్రెగ్నెన్సీపై చిన్న‌హింట్ ఇచ్చింద‌ని అంటున్నారు.