Adbutham Movie Review: ‘అద్భుతం’ సినిమా రివ్యూ

Adbutham Movie Review: తేజ సజ్జా, శివాని రాజశేఖర్ లు జంటగా నటిస్తున్న అద్భుతం సినిమాకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈరోజు డిస్నీప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Adbhutham Movie Review and Rating
Adbhutham Movie Review and Rating

కథ : సూర్య ఓ టీవీ ఛానెల్ లో యాంకర్ గా వర్క్ చేస్తున్నారు. హైదరాబాద్ లో ఓ రోజు క్లైమెట్ అంతా మారిపోతుంది. సెల్ ఫోన్ కాల్స్ జంప్ అవుతుంటాయి. లైఫ్ తనకు నచ్చినట్లు లేదని ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. సరిగ్గా అదే సమయానికి తన ఫోన్ కు ఓ మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చేసిన అమ్మాయి హీరోయిన్ వెన్నెల. వీరిద్దరి మధ్య పరిచయం పెరిగాక.. సూర్య 2019 లో. వెన్నెల 2014 లో ఉన్నట్లు తెలుస్తుంది. అక్కడి నుండి సినిమా స్టోరీ ఎలా టర్న్ అవుతుందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల పర్ఫార్మెన్స్ : హీరో తేజ సజ్జా యాక్టింగ్ నీట్ గా డీసెంట్ ఉంది. ఇంతకు ముందు నటించిన సినిమాల కన్నా అద్భుతం సినిమాలో ఇంకా మెచ్యూర్డ్ గా యాక్ట్ చేశారు. ఎమోషనల్ సీన్స్ లో చక్కగా నటించారు. ఇక శివాని రాజశేఖర్ హీరోయిన్ గా మంచి యాక్టింగ్ చేసింది.

Adbhutham Movie Review and Rating
Adbhutham Movie Review and Rating

టెక్నికల్ టీం ప‌నితీరు : డైరెక్టర్ మల్లిక్ రామ్ ఈ సినిమాతో పరిచయం అయినా తన టేకింగ్ బావుంది. కెమెరామెన్ విద్యాసాగర్ తన టాలెంట్ ని ఈ సినిమాలో ప్రజంట్ చేశారు. రథన్ మ్యూజిక్ ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది.

Adbhutham Movie Review and Rating
Adbhutham Movie Review and Rating

ప్లస్ పాయింట్స్ :

  • హీరో హీరోయిన్ల యాక్టింగ్,
  • డైరెక్టర్
  • కథ, స్క్రీన్ ప్లే
  • సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

  • ఎడిటింగ్,
  • కీలకమైన సీన్స్ లో ల్యాగ్

విశ్లేషణ : అద్భుతం సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య లవ్ సీన్స్, ఎమోషనల్ కంటెంట్ చక్కగా ఉంది. ఈ సినిమా కాస్త అటు ఇటుగా గతంలో వచ్చిన ప్లే బ్యాక్ సినిమాని గుర్తు చేస్తుంది.

చివరగా : ఈ సినిమా అద్భుతంగా లేకపోయినా ఎంటర్ టైనింగ్ గా ఉంది.

రేటింగ్: 3/5