టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మేజర్. వరస సక్సస్ లతో మంచి క్రేజ్ తో ఉన్న అడవి శేష్ ఎక్కువగా ప్రయోగాత్మకమైన సినిమాలలోనే నటిస్తూ పాపులారిటీని సంపాదించుకున్నాడు. క్షణం, గూఢచారి .. సినిమాలతో పాటూ రీసెంట్ గా వచ్చిన ఎవరు లాంటి సూపర్‌హిట్ సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్ ప్రస్తుతం మేజర్ అన్న సినిమాలో నటిస్తున్నాడు. 26/11 ముంబై టెర్రర్ అటాక్స్‌లో ప్రజలను కాపాడి వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుండగా ‘గూఢచారి’ ఫేం శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ సినిమాని సోనీ పిక్చర్స్, స్టార్ మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీ బ్యానర్స్‌తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తుండగా తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా మేజర్ సినిమా ఎలా మొదలైందన్న పలు ఆసక్తికరమైన విషయాలను హీరో అడవి శేష్ రీసెంట్ గా ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమా పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమా తర్వాత అడవి శేష్ మరో హిట్ సినిమా సీక్వెల్ లో నటించబోతున్నాడని లేటెస్ట్ న్యూస్. నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వచ్చిన హిట్ సినిమా సీక్వెల్ ని రూపొందించబోతుండగా ఆ సీక్వెల్ లో అడవి శేష్ హీరోగా నటించబోతున్నాడట. హిట్ సినిమా ఫస్ట్ పార్ట్ లో విశ్వక్ సేన్ హీరోగా నటించాడు. శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. ఈ సినిమాని కూడా నాని నిర్మించబోతుండగా శైలేష్ కొలను దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా మార్చ్ నుంచి షూటింగ్ మొదలవబోతుందట.