Adah Sharma: ఇంట్లో బోర్ కొడుతోందా?.. అదా శర్మ పిల్లి చేష్టలు!

Adah Sharma ఆదా శర్మ సోషల్ మీడియాలో చేసే అల్లరి గురించి అందరికీ తెలిసిందే. అందాల ఆరబోతలో ఆదా శర్మ శైలి వేరు. ఎప్పుడూ వెరైటీగా కనిపించేందుకు తాపత్రయ పడుతూఉంటుంది. ఆదాశర్మ స్టైలింగ్, స్టైల్‌కు అందరూ ఫిదా అవుతుంటారు. ఒక్కోసారి ఆమె ధరించే వస్త్రాలు అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తుంటాయి. ఆమె సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది.

తాజాగా ఆమె ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె కోతిలా పిచ్చి చేష్టలన్నీ చేసింది. అసలే ఇప్పుడు అందరూ ఇంటి పట్టునే ఉంటున్నారు. కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు అందరూ కుదేలయ్యారు. ఇంటి పట్టునే ఉంటూ ప్రాణాలను అరచేతిలో పట్టుకుని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో ఆదా శర్మ ఓ ఫన్నీ వీడియోను షేర్ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Adah Sharma (@adah_ki_adah)

ఇంట్లో బోర్ కొడుతోందా?.. అదా శర్మ పిల్లి చేష్టలు!

ఇంట్లో బోర్ కొడుతోందా? అంటూ అభిమానులను ప్రశ్నించింది ఆదా శర్మ. పిల్లి బొమ్మను మూతికి పెట్టుకుని రకరకాలు విన్యాసాలు చేసింది. ఖాళీగా ఉన్న కడుపులో మీరు ఎన్ని అరటి పళ్లు తింటారు అని ప్రశ్నించింది. ఈ క్రమంలో ఆమె షేర్ చేసిన ఈ వీడియోలు బుల్లి నిక్కర్లో దర్శనమిచ్చింది. నాభి అందాలను ప్రదర్శిస్తూ అందరినీ కట్టిపడేసింది. మొత్తానికి అదా శర్మ మాత్రం హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement