Bhola Shankar : అప్పుడు చిరంజీవికి కూతురిగా, ఇప్పుడు ఆయ‌న‌కు అమ్మ‌గా నటిస్తున్న

Bhola Shankar : చిరంజీవితో న‌టించాల‌ని ఎంతో మందికి కోరిక. ఆ అవ‌కాశం వ‌స్తే ఎవ‌రైన ఛాన్స్ వ‌దులుకుంటారా. త‌ప్ప‌క అవ‌కాశాన్ని అందిపుచ్చుకుంటారు. ప్ర‌స్తుతం మెగాస్టార్ వ‌ర‌స‌బెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఇందులో అన్ని క్రేజీ ప్రాజెక్ట్ చిత్రాలే ఉన్నాయి. అయితే మెహ‌ర్ ర‌మేష్ తెర‌కెక్కిస్తున్న భోళా శంక‌ర్ చిత్రానికి సంబంధించి అనేక వార్త‌లు ఈ మ‌ధ్య తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

Actress Tulasi Reveals About Her Role In Bhola Shankar Movie and Megastar Chiranjeevi
Actress Tulasi Reveals About Her Role In Bhola Shankar Movie and Megastar Chiranjeevi

తమిళంలో సూపర్‌హిట్ అందుకున్న ‘వేదాళం రీమేక్‌గా భోళా శంక‌ర్ సినిమా రూపుదిద్దుకోనుంది. అన్నాచెల్లెళ్ల అనుబంధంతో పాటు పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా సిద్ధం కానుంది. ఇందులో చిరు సోదరి పాత్రలో కీర్తి సురేష్ కనిపించనున్నారు. అలాగే మెగాస్టార్‌కు జోడీగా తమన్నా సందడి చేయనున్నారు. మణిశర్మ కుమారుడు మహతి సాగర్‌ స్వరాలు సమకూర్చనున్నారు.

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సీనియర్ న‌టి తుల‌సి ఆయ‌న‌కు అమ్మ పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ట‌. తాజ‌గా ఓ ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యాన్ని చెబుతూ సంతోషించింది. గ‌తంలో త‌ను చిరుకి కూతురిగి న‌టించిన‌ట్టు పేర్కొంది.

చిరంజీవి సినిమాలో అవ‌కాశం రావ‌డంతో వెంట‌నే ఓకే చెప్పాను. అంత పెద్ద స్టార్ హీరోతో సినిమా చేస్తే అది నా కెరీర్‌కి మ‌రింత ఉప‌యోగంగా ఉంటుంద‌ని భావిస్తున్నా అని తులసి పేర్కొంది. ఇందులో శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీలో తెరకెక్కుతున్న మాస్‌ సాంగ్‌లో రష్మికి అవకాశం రావడం నిజంగా అదృష్టమేనని సినీ జనాలు అంటున్నారు.