Actress Tabu : త్వరలోనే పిల్లల్ని కంటా.. భర్తతో పనిలేదు.. టబు సంచలనం..!
NQ Staff - June 10, 2023 / 04:28 PM IST

Actress Tabu : హీరోయిన్ టబు మరోసారి సంచలనం రేపింది. త్వరలోనే పిల్లల్ని కంటానంటూ స్టేట్ మెంట్ ఇచ్చేసింది. ఇందులో ఆశ్చర్యపోవాల్సింది ఏముంది అంటారా.. ఉందండి బాబు. ఎందుకంటే ఆమెకు ఇప్పటి వరకు పెళ్లి కాలేదు. ప్రస్తుతం టబు వయసు యాభై ఏళ్లు. కానీ ఇంకా సింగిల్ గానే లైఫ్ ను లీడ్ చేస్తోంది.
అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ భామ.. ఇప్పుడు కీలక పాత్రల్లో నటిస్తూ వస్తోంది. ఇదిలా ఉండగా ఆమె గతంలో ఓ ప్రకటన చేసింది. పిల్లల్ని కనడానికి పెండ్లి అవసరం లేదు. భర్త లేకుండానే నేను పిల్లల్ని కంటాను అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది. దాంతో ఆమె మీద తీవ్ర విమర్శలు వచ్చాయి.
అయినా సరే టబు వెనక్కు తగ్గట్లేదు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. నేను భర్త లేకుండానే పిల్లల్ని కంటాను. నాకు సమాజంతో పనిలేదు. త్వరలోనే పిల్లల్ని కనబోతున్నాను. ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటూ తెలిపింది.
రీసెంట్ గానే ఇలియానా కూడా భర్త లేకుండానే ప్రెగ్నెంట్ అయిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు టబు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే ఇలియానాకు వయసు ఉంది.. కానీ టబు వయసు ఆల్రెడీ యాభై దాటిపోతోంది. మరి ఈ వయసులో ఆమె పిల్లల్ని కనడం ఆశ్చర్యమే అని చెప్పుకోవాలి.