Actress Surekha Vani : ముసలోళ్లందరికీ పెళ్లి అవుతోంది.. నాకు కావట్లేదే.. నరేశ్-పవిత్రపై సురేఖ వాణి సెటైర్లు..!
NQ Staff - May 27, 2023 / 04:05 PM IST

Actress Surekha Vani : ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అంటే నరేశ్-పవిత్ర లోకేష్ ది మాత్రమే అని చెప్పాలి. ఎందుకంటే వీరిద్దరూ ఇప్పుడు పెండ్లికి రెడీ అయ్యారు. నరేశ్ కు 60 ఏండ్ల వయసు ఉంది. అలాగే పవిత్రకు 40 ఏండ్ల వయసు ఉంది. ఈ వయసులో ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఇప్పటికే నరేశ్ కు మూడు పెండ్లిలు అయ్యాయి.
ఇప్పుడు ఆయన నాలుగో పెండ్లికి రెడీ అయ్యాడు. పైగా వీరిద్దరూ కలిసి మళ్లీ పెళ్లి అనే సినిమాలో కూడా నటించారు. ఇది వీరిద్దరి బయోపిక్ ఆధారంగా వచ్చినట్టు చెబుతున్నారు. ఇక వీరి బాటలోనే నటుడు ఆశిష్ విద్యార్థి కూడా 60 ఏళ్ల వయసులో 33 ఏళ్ల అమ్మాయిని మళ్లీ పెండ్లి చేసుకున్నారు.
అయితే తాజాగా నటి సురేఖవాణి వీరిద్దరి పెండ్లిలపై సెటైర్ వేసింది. ఇన్ స్టాలో ఓ వీడియోను పోస్టు చేసింది. ఇందులో నరేష్, పవిత్రలని.. రీసెంట్ గా సెకండ్ మ్యారేజ్ చేసుకున్న ఆశిష్ విద్యార్థిని ట్రోల్ చేస్తూ పోస్ట్ చేసింది. ముసలోళ్ళందరికి పెళ్లిళ్లు అవుతున్నాయి. నాకు కావడం లేదు ఏంటి అంటూ వాపోతున్నట్లు ఈ పోస్టు ఉంది.

Actress Surekha Vani Satires On Naresh Pavitra Lokesh Wedding
దీంతో ఈ పోస్టు వైరల్ అవుతోంది. సురేఖవాణి భర్త గతంలో మరణించారు. అప్పటి నుంచి కూతురుతో కలిసి ఉంటుంది. పైగా కూతురుతో కలిసి ఆమె చేసే రీల్ వీడియోలు చాలా ఫేమస్. ఈ వయసులో కూడా ఆమె అందాలను ఓ రేంజ్ లో ఆరబోస్తోంది. అందుకే అప్పుడప్పుడు వివాదాల్లో నిలుస్తోంది సురేఖ వాణి.