Surekha Vani: వామ్మో.. కూతురితో ఈ రచ్చేంది సురేఖా వాణి!
Samsthi 2210 - August 16, 2021 / 04:50 PM IST

Surekha Vani: ఎన్నో సినిమాలు,మరెన్నో వేషాలు వేసిన కూడా దక్కని క్రేజ్ సోషల్ మీడియా ద్వారా వస్తుంది. సోషల్ మీడియాలో కాస్త వెరైటీగా ఏదైన చేస్తే ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారడం ఖాయం. ప్రియా ప్రకాశ్ వారియర్,బేబి వంటి వారు అలానే సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ అందుకున్నారు.ఇప్పుడు సురేఖా వాణి కూడా సోషల్ మీడియా ద్వారా అశేష ప్రేక్షకాదరణ పొందుతుంది.

Actress Surekha Vani Dance With Daughter Supriya
ఒకప్పుడు వెండితెరపై చాలా పద్దతిగా కనిపించిన సురేఖా వాణి ఇప్పుడు సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాక కూతురితో కలిసి నానా రచ్చ చేస్తుంది. మోడ్రన్ దుస్తులలో ఈ అమ్మడి చేసే రచ్చకి సోషల్ మీడియా కూడా షేక్ అవుతుంది. తరచూ డ్యాన్స్ వీడియోలు, రీల్స్ చేసుకుంటూ ఆమె అభిమానులను అలరిస్తూ ఉంటారు. తన కూతురితో సమానంగా సురేఖా కూడా డ్యాన్స్ వీడియోలతో చిందులు వేస్తుంటారు.
తాజాగా కూతురితో కలిసి సురేఖావాణి చేసిన ఓ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.నేడు (ఆగస్టు 8) సుప్రిత పుట్టిన రోజు సందర్భంగా తల్లీకూతుళ్లిద్దరూ కలిసి జాలీగా గడిపారు. ఎప్పటిలాగే డాన్సులేస్తూ తమదైన స్టెప్పులతో రెచ్చిపోయారు. తల్లి సురేఖతో కలిసి డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసిన ఆ వీడియోను తన ఇన్స్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది సుప్రిత. ఈ వీడియోపై నెటిజన్స్ భిన్న కామెంట్స్ చేస్తున్నారు.

Actress Surekha Vani Dance With Daughter Supriya
భర్త సురేష్ తేజ చనిపోయిన తరువాత ఆ బాధను దిగమింగుతూనే కూతురుతో సరదాగా గడుపుతోంది సురేఖావాణి. వీలు కుదిరినప్పుడల్లా కూతురు సుప్రితతో కలిసి హాలిడే ట్రిప్స్, పబ్స్ తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది. గత కొంత కాలంగా సురేఖా వాణి,సుప్రిత చేస్తున్న రచ్చ ఫిలిం నగర్‌లో హాట్ టాపిక్గా మారింది. అతి త్వరలో సుప్రితని కూడా హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం చేయాలని చూస్తుంది సురేఖా.
ప్రస్తుతం సురేఖా కూతురు సుప్రిత నటనలో శిక్షణ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇది పూర్తయ్యాక ఆమె వెండితెర ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. సుప్రిత గతంలో పలు షార్ట్ ఫిలింస్‌లో నటించి అలరించిన విషయం తెలిసిందే