Actress Sumbul Taukeer : తండ్రికి మళ్లీ పెళ్లి చేస్తున్న ప్రముఖ నటి.. తల్లితో పాటు సోదరి కూడా..!
NQ Staff - June 10, 2023 / 09:11 AM IST

Actress Sumbul Taukeer : పిల్లలను ప్రేమగా చూడటం తల్లిదండ్రుల బాధ్యత. వారి బాగోగులు చూసుకోవడం లాంటివి చేస్తారు. కానీ పిల్లల బాధ్యతల గురించే కాదు… పిల్లలు కూడా తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తున్నారు. అందుకే ఒంటరిగా ఉంటున్న తమ తల్లి లేదా తండ్రికి మళ్లీ పెళ్లి చేస్తున్నారు చాలామంది. తాజాగా ఓ ప్రముఖ నటి కూడా ఇలాంటి పని చేయబోతోంది.
ఆమె ఎవరో కాదు హిందీ బిగ్ బాస్ లో పాల్గొన్న బుల్లితెర నటి సుంబుల్ తౌకీర్. ఆమె తాజాగా గుడ్‌న్యూస్ చెప్పింది. తన తండ్రికి మళ్లీ పెళ్లి చేయబోతున్నట్టు వివరించింది. హిందీ ‘బిగ్ బాస్ 16’ ఫేమ్, బుల్లితెర నటి సుంబుల్ తౌకీర్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఇందులో ఆమె మాట్లాడుతూ మా నాన్న నా చిన్న వయసు నుంచి నన్ను చూసుకుంటున్నారు.
నాకు అమ్మ లేదు. అన్నీ మా నాన్నతోనే షేర్ చేసుకునేదాన్ని. ఇప్పుడు నేను ఆయన కోసం ఆలోచిస్తున్నాను. త్వరలోనే ఆయనకు పెళ్లి చేయబోతున్నాను. అన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటున్నాను. మా నాన్నగారికి వచ్చే భార్యతో పాటు ఒక కొత్త సోదరి కూడా మా ఫ్యామిలీలోకి వస్తుంది.
మా నాన్న రెండో పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు నీలోఫర్. ఆమెకు గతంలోనే పెళ్లి అయి విడాకులు కూడా అయ్యాయి. ఆమెకు ఓ రెండేళ్ల పాప కూడా ఉంది. కాబట్టి నాకు సోదరి రాబోతోంది అంటూ సంతోషంగా తెలిపింది.
సుంబుల్ తౌకీర్ చేసిన కామెంట్లకు అంతా ప్రశంసిస్తున్నారు. నీ లాంటి కూతురు అందరికీ ఉండాలని చెబుతున్నారు. మరికొందరు మాత్రం నువ్వు పెళ్లి చేసుకునే వయసులో నీ తండ్రికి పెళ్లి చేయడం ఏంటని అడుగుతున్నారు.