Actress: పాపం ఆ హీరోయిన్ డైలీ పేమెంట్స్ స్థాయికి పడిపోయింది.!

NQ Staff - April 17, 2022 / 12:38 AM IST

Actress: పాపం ఆ హీరోయిన్ డైలీ పేమెంట్స్ స్థాయికి పడిపోయింది.!

Actress: అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని.. అన్నట్టుగా కొంతమంది సెలబ్రిటీలకు లక్కు అస్సలు కలిసి రాదు. వరుసగా ఆఫర్లు వస్తున్నా, అంతంత మాత్రం స్టార్‌డమ్‌తోనే సరిపెట్టుకోవల్సి వస్తుంటుంది. అలాగే టాలీవుడ్‌లో ఓ హీరోయిన్ పరిస్థితి తయారైంది.

Actress Stardom Turned down to Daily Payments

Actress Stardom Turned down to Daily Payments


ఒకప్పుడు ఈ ముద్దుగుమ్మ సెన్సేషనలే. పేరు మాత్రం ఇప్పుడు ప్రస్థావించుకోలేం కానీ, ఓ యంగ్ హీరో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అదే హీరోతో బ్యాక్ టు బ్యాక్ మూడు, నాలుగు సినిమాల్లో నటించేసంది. ఇప్పుడా యంగ్ హీరోతోనే డేటింగ్‌లో వుందంటూ గుప్పా గుప్పా గుసగుసలు కూడా బాగా ప్రచారంలో వున్నాయ్.

ఇంతకీ అసలు విషయమేంటంటే, హీరోయిన్‌గా అప్పట్లో 40 లక్షల దాకా రెమ్యునరేషన్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ, అవకాశాలు తగ్గేసరికి ఇప్పుడు డైలీ పేమెంట్స్ స్థాయికి పడిపోయిందంట. స్టార్‌డమ్ లేదనే కానీ, అలా డైలీ పేమెంట్స్ కారణంగా ఈ ముద్దుగుమ్మ బాగానే రాళ్లు వెనకేసుకుంటోందట.

దాదాపు ఒక్కో సినిమాకీ 5 నుంచి 10 లక్షల వరకూ సంపాదిస్తోందనీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అదేదో సామెత చెప్పినట్టు డాష్ పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్లుగా అసలే అవకాశాలూ లేని టైమ్‌లో ఆ సంపాదన చాలా ఎక్కువే కదా.. ఆ పాపకి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us