Sree leela : పెళ్లి సంద‌డి హీరోయిన్ శ్రీలీల మ‌తులు పోగొడుతుందిగా..!

Sree leela : ఒక్క సినిమాతో అంద‌రి మ‌న‌సులు దోచేసిన అందాల ముద్దుగుమ్మ శ్రీ లీల‌. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు చాలా మంది అందాల భామలను తెలుగు తెరకు పరిచయం చేశారు. ఇప్పుడు ఈ చిన్నదాన్ని కూడా ఆయనే పరిచయం చేసారు.రాఘవేంద్ర రావు తెరకెక్కించిన‌ పెళ్ళిసందడి 2లో హీరోయిన్ గా నటించిన ఈ ముద్ద‌గుమ్మ తెలుగు ఇండ‌స్ట్రీలో ర‌చ్చ చేస్తుంది.

TheNewsQube-
Actress Sree Leela Latest Beautiful Video
Actress Sree Leela Latest Beautiful Video

పెళ్లి సంద‌డి సినిమాతో తెరంగేట్రం చేసింది శ్రీ‌లీల‌. గ‌త‌వారం విడుద‌లైన ఈ సినిమాకి దారుణ‌మైన రివ్యూలొచ్చాయి. కాక‌పోతే వ‌సూళ్ల ప‌రంగా కాస్త మెరుగ్గా ఉంది. దానికి తోడు శ్రీ‌లీల‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. కాస్త బొద్దుగా, చూడ‌గానే ఆక‌ట్టుకునేలా ఉంది శ్రీ‌లీల‌. పైగా డాన్సుల్లో ఈజ్ చూస్తే మ‌తి పోయింది. రాఘ‌వేంద్ర‌రావు ఫ్రేమ్ లో… శ్రీ‌లీల మ‌రింత అందంగా క‌నిపించింది.

నిజానికి ఈసినిమా విడుద‌ల‌కు ముందే.. శ్రీ‌లీల దృష్టి టాలీవుడ్ పై ప‌డింది. ర‌వితేజ సినిమాలో శ్రీ‌లీల హీరోయిన్ గా ఫిక్స‌య్యింది. ఇప్పుడు రిలీజ్ అయ్యాక‌.. మ‌రిన్ని అవ‌కాశాలు వ‌రుస క‌డుతున్నాయి. శ‌ర్వా, నితిన్‌, నిఖిల్, సాయిధ‌ర‌మ్ తేజ్‌.. ఇలాంటి యంగ్ బ్యాచ్ ప‌క్క‌న శ్రీ‌లీల అయితే బాగుంటుంద‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు.

కొత్త హీరోల‌కైతే త‌ను మంచి ఆప్షనే. ఇప్ప‌టికి త‌న చేతిలో నాలుగు సినిమాలున్నాయని తెలుస్తోంది. కొత్త‌గా మ‌రో రెండు ఆఫ‌ర్లూ వ‌చ్చాయ‌ట‌.చూస్తుంటే… శ్రీ‌లీల ఇండ్ర‌స్ట్రీలో కొన్నాళ్లు పాతుకుపోయేలానే క‌నిపిస్తోంది. ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

శ్రీలీల తాజాగా స్టైలిష్ వీడియో విడుదల చేసి మ‌తులు పోగొట్టింది. చాలా క్యూట్ క్యూట్‌గా క‌నిపిస్తున్న శ్రీలీల చిందులేస్తూ క‌నిపించింది. శ్రీలీలని చూసి అందరి మ‌తులు పోతున్నాయి.