Shakeela: కూతురిని హీరోయిన్‌గా ప‌రిచ‌యం చేస్తూ సినిమా చేస్తున్న ష‌కీలా

Shakeela వెండితెర‌పై ఓ వెలుగు వెలిగి సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచింది షకీలా. హీరోల‌కు ధీటుగా ష‌కీలా సినిమాలు బాక్సాఫీస్‌ని షేక్ చేసేవి. ఈ మ‌ధ్య త‌న బ‌యోపిక్‌తో వార్త‌ల‌లో నిలిచిన ష‌కీలా ప్ర‌స్తుతం నిర్మాత‌గా సినిమాలు చేస్తుంది. రమేష్ కావలి చెప్పిన స్టోరీ న‌చ్చ‌డంతో ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో `అట్టర్ ప్లాప్, రొమాంటిక్` అనే రెండు సినిమాల‌ని నిర్మిస్తుంది ష‌కీలా.

రీసెంట్‌గా రామా నాయుడు స్టూడియోలో సినిమా పోస్ట‌ర్స్ లాంచ్ చేయ‌గా, ఆ కార్య‌క్ర‌మంలో మాట్లాడిన ష‌కీలా.. త‌మ్ముడు రమేష్ చెప్పిన ఈ రెండు సినిమాలు నాకెంతో నచ్చాయి..అందరూ కొత్త వారితో ఈ సినిమాలు చేస్తున్నాము. ఈ రెండు సినిమాల్లో కూడా నా కూతురు మిలా హీరోయిన్గా న‌టిస్తోంది. గోవాలో అద్భుతమైన లోకేషన్స్ లలో షూటింగ్ చేస్తున్నాం.

మేము తీసిన “లేడీస్ నాట్ అలౌడ్” సినిమాకు సెన్సార్ విషయంలో మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ఎంతో మందిని రిక్వెస్ట్ చేసుకున్నాము. అందుకే ఇక మేము ఎవరినీ రిక్వెస్ట్ చేసుకోకూడదని ఓటిటి ని స్టార్ట్ చెయ్యాలని ప్లాన్ చేశాం. మేము ఎదుర్కొన్న ఇబ్బందులు కొత్తవారు ఎదుర్కోరాదని కొత్తగా ఇండస్ట్రీ కు వచ్చే వారికి వెల్ కమ్ పలుకుతూ అందరికీ మా ఓటిటి ప్లాట్ ఫాం ఒక వేదిక కావాలని అనుకుంటున్నానని అన్నారు.

“కె.ఆర్ డిజిటల్ ప్లెక్స్” ఓటిటి ద్వారా అనేక సినిమాలు చేస్తూ ఇందులో వారు తీసిన షార్ట్ ఫిల్మ్, సినిమా ఏదైనా కూడా ఫ్రీగా సపోర్ట్ చేస్తాము అరి ద‌ర్శ‌కుడు ర‌మేష్ అన్నారు. ప్రస్తుతం అవివాహితగానే మిగిలిపోయిన షకీలా కొద్ది రోజుల క్రితం త‌న‌ టీనేజ్ కూతుర్ని పరిచయం చేసింది. త‌న‌ డాటర్ ట్రాన్స్ జెండర్ అంటూ షాక్‌ల మీద షాక్‌లు ఇచ్చింది. ఇప్పుడు ఆమెను క‌థానాయిక‌ని చేస్తుండ‌డం విశేషం

చాలా ఏళ్ల క్రితం మిలాని దత్తత తీసుకుంది షకీలా. ఆమె బాల్యంలోనే దత్తత తీసుకుంది. తన కూతురు మిల్లా.. మోడలింగ్ రంగంలో రాణించాలని చూస్తుందని.. ప్రస్తుతం కాస్టూమ్ డిజైనర్‌గా కెరియర్ సాగిస్తుందని ఆమె గురించి పలు ఆసక్తికరమైన విషయాలను అప్ప‌ట్లో తెలియ‌జేసింది.