Sanjana: సీక్రెట్ మ్యారేజ్ ఎందుకు చేసుకుందో చెప్పిన బుజ్జిగాడు భామ

Sanjana: ఈ మధ్య కొందరు హీరోయిన్లు ఎందుకో తెలియదు కానీ సీక్రేట్ గా పెళ్లి చేసుకుంటున్నారు. మొన్న ప్రణీత.. ఇప్పుడు యామీ గౌతమ్ లాంటి హీరోయిన్లు చెప్పకుండానే పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ అందరి కంటే ముందే ఏడాది కిందే ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకుంది సంజన. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎందుకంటే సినిమాల కంటే కూడా వివాదాలతోనే ఎక్కువగా ఫేమస్ అయింది ఈ బ్యూటీ. ముఖ్యంగా డ్రగ్స్ కేసులో ఇరుక్కుని జైలుకు కూడా వెళ్లొచ్చింది సంజన. ప్రభాస్ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘బుజ్జిగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ బ్యూటీ.. కన్నడలో మర్డర్ రీమేక్‌తో సంచలనం రేపింది.

Actress Sanajana Reveals About Her MArriage
Actress Sanajana Reveals About Her MArriage

హిందీలో నటించిన మల్లికా శరావత్ కంటే ఎక్కువగా అందాలు ఆరబోసి పిచ్చెక్కించింది సంజన. ఆ సినిమాతో సెక్సీ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈమె.. కన్నడలో అలాంటి సినిమాలే చేసింది కూడా. ఆ తర్వాత పూరీ పుణ్యమా అని బుజ్జిగాడులో అవకాశం అందుకుని ఇక్కడ కొన్ని సినిమాలు చేసింది. తెలుగులో 10 సినిమాలకు పైగానే నటించినా కూడా ఈమెకు గుర్తింపు మాత్రం రాలేదు. అయితే సినిమాలతో రాని గుర్తింపు ఈమెకు డ్రగ్స్ కేసుతోనే వచ్చేసింది. 2020 కన్నడ డ్రగ్స్ కుంభకోణంలో ప్రధాన నిందితురాలుగా పట్టుబడి జైలుకు వెళ్లొచ్చింది కూడా. ఈమెతో పాటు మరో హీరోయిన్ రాగిణి ద్వివేది కూడా ఊచలు లెక్క పెట్టింది.

ఇదిలా ఉంటే ఆ సమయంలోనే ఈమె పెళ్లి చేసుకుంది. సంజన పెళ్లి చేసుకున్న విషయం చాలా మందికి తెలియదు కూడా. ఈ విషయాన్ని ఈమె కూడా బయటికి చెప్పలేదు. అయితే చాలా రోజుల తర్వాత తాజాగా తన పెళ్లి గురించి అసలు రహస్యాలు బయటపెట్టింది సంజన. తను సీక్రేట్ గా పెళ్లి చేసుకోడానికి గల కారణం డ్రగ్స్ కుంభకోణమే అని తెలిపింది సంజన. పెళ్లి కుదిరిన తర్వాతే డ్రగ్స్ కేసు బయటకు వచ్చిందని.. ఆ తర్వాత చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు తెలిపింది సంజన. అందుకే అప్పుడు పెళ్లి చేసుకున్నా కూడా ఎవరినీ పిలవలేదని.. కనీసం చెప్పలేదని చెప్పింది. తర్వాత పార్టీ ఇవ్వాలనుకున్నా కూడా లాక్ డౌన్ కారణంగా కుదర్లేదని చెప్పుకొచ్చింది సంజన.