Actress: హీరోయిన్ ఇన్‌స్టాగ్రామ్ నిండా బూతు ఫొటోలే.. అస‌లు నిజం తెలుసుకొని షాక్

Samsthi 2210 - August 16, 2021 / 04:50 PM IST

Actress: హీరోయిన్ ఇన్‌స్టాగ్రామ్ నిండా బూతు ఫొటోలే.. అస‌లు నిజం తెలుసుకొని షాక్

Actress: ఈ నాటి అందాల భామ‌లు సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నార‌నే సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే. సోష‌ల్ మీడియాలో హీరోయిన్స్ చేసే ర‌చ్చ వేరే లెవ‌ల్‌లో ఉంటుంది. క్లీవేజ్ షోస్ లేదంటే తొడ అందాల ఆర‌బోత చేస్తూ నెటిజ‌న్స్‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నారు. అయితే వారి పేర్ల‌తో న‌కిలీ అకౌంట్స్ క్రియేట్ చేసి అంద‌రులో పోర్న్ ఉంచ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.

Actress Sadhika Venugopal Instagram Pics

Actress Sadhika Venugopal Instagram Pics

తాజాగా కేరళలో హీరోయిన్ సాధికా వేణుగోపాల్ విష‌యంలో అదే జ‌రిగింది. ఆమెకు ఇండస్ట్రీకి చెందిన ఒక‌రు కాల్ చేసి.. “ఇలా అంటున్నానని ఏమనుకోకండి… మీ ఇన్‌స్టాగ్రామ్ పేజీ నిండా బూతు బొమ్మలే ఉన్నాయి.. నమ్మలేకపోతున్నాను” అన్నారు. ఆయ‌న చెప్పిన మాట‌ల‌కు షాకైన హీరోయిన్.. “ఏంటి మీరనేది… నా గురించి మీకు తెలుసు కదా… నేను ఎక్స్‌పోజింగే చెయ్యను… ఇంక బూతులేంటి” అని అడిగితే… “సరే మేడమ్ ఏం జరిగిందో ఏమో… మీకు ఆ పేజీ లింక్ పంపుతాను. మీరే డిసైడ్ చేసుకోండి” అంటూ… ఆ వ్యక్తి… ఓ ఇన్‌స్టాగ్రామ్ పేజీని ఆమెకు షేర్ చేశారు

ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఓపెన్ చేస్తే ఆమె పేరుతో అకౌంట్ ఉండ‌గా, ప్రొఫైల్ ఫొటో కూడా ఆమెదే ఉంది. కానీ… లోపల ఫొటోలన్నీ బూతు బొమ్మలే. ఇది చూసి షాకైన హీరోయిన్ ఎవ‌రోత త‌న పేరుతో న‌కిలీ అకౌంట్ ఓపెన్ చేశార‌ని భావించింది. వెంట‌నే కేరళ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. కేరళ… కొచ్చి క్రైమ్ బ్రాంచ్… సైబర్ క్రైమ్ పోలీసులు… ఆ ఇన్‌స్టాగ్రామ్ పేజీని ఏ ఇంటర్నెట్ IP అడ్రెస్ ద్వారా రన్ చేస్తున్నారో గమనించారు. ఆ IP అడ్రెస్… ఎవరి ఇంటర్నెట్టో కనిపెట్టారు.

ఆ వ్య‌క్తిని తీసుకొచ్చి సాధిక ముందు పోలీసులు ఉంచగా క‌ల్ల‌బొల్లి క‌బుర్లు చెప్పాడు. నా ఫ్రెండ్స్ నా ఫోన్ తీసుకొని అలా చేసి ఉంటారు. వెంటనే సాధిక “ఇదే మీ అమ్మో, అక్కో అయితే… వాళ్ల ఫొటోలు పెడతావా” అని అడిగితే… ఆ వ్యక్తి క్షమించమని ప్రాథేయపడ్డాడు. “అందరు అమ్మాయిలూ ఒకటే. అందరికీ మనసు ఉంటుంది. ఇలాంటివి ఎవరికి చేసినా వాళ్లూ బాధపడతారు.” అంటూ అత‌డిని గ‌ట్టిగానే మంద‌లించింది.

అయితే ఆ వ్యక్తి కెరీర్‌ని నాశ‌నం చేయ‌డ‌మెందుకు అని భావించిన సాధిక పోలీస్ కేసు వాప‌స్ తీసుకొని ఇంకోసారి ఇలాంటి ప‌నులు చేయ‌కుండా ఉండ‌మ‌ని గ‌ట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఇదే విషయాన్ని నటి సాధిక… తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా నెటిజన్లతో పంచుకున్నారు. ఈ కేసులో నేరస్థుడు… కేరళలోని అలప్పుళాకి చెందినవాడు. అతన్ని చాలా త్వరగా పట్టుకున్నందుకు పోలీసులకు థాంక్స్ చెప్పింది సాధిక. పిల్ల‌లు ఆన్‌లైన్ క్లాసులు అంటూ ఇంట‌ర్నెట్‌లో చెత్త‌వి చూడ‌కుండా ఉండాల‌ని కోరింది సాధిక.

Read Today's Latest సినిమా రివ్యూలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us