Sadha: మాధ‌వ‌న్‌తో రిలేష‌న్‌షిప్‌పై నోరు విప్పిన సదా

Samsthi 2210 - June 30, 2021 / 11:08 AM IST

Sadha: మాధ‌వ‌న్‌తో రిలేష‌న్‌షిప్‌పై నోరు విప్పిన సదా

Sadha నితిన్ హీరోగా తెర‌కెక్కిన జ‌యం సినిమాతో అంద‌రి దృష్టిన ఆక‌ర్షించిన అందాల ముద్దుగుమ్మ స‌దా. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు సినిమాల‌కు దూరంగా ఉంటూ ప‌లు షోస్ చేస్తుంది. అయితే రీసెంట్‌గా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీ తో సరదాగా’ కార్యక్రమంలో పాల్గొని ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం స‌దా వ్యాఖ్యలు తెలుగు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

కాంట్రవర్సీలకు ఎంతో దూరంగా ఉండే.. సదా సోషల్ మీడియాలోనూ ఎక్కువ యాక్టివ్‌గా ఉండరు. అలాంటి సదా తాజాగా తన పర్సనల్, ప్రొఫెషన్ విషయాల గురించి బయటపెట్టేశారు. అప‌రిచితుడు సినిమాతో కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన సదా నాగ సినిమాలో ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టించింది. ఆయ‌న‌తో ఎక్స్‌పీరియెన్స్ షేర్ చేసుకుంది. ఎన్టీఆర్ లాంటి డ్యాన్స‌ర్‌ను తాను చూడ‌లేద‌ని, ఎంతో ఈజ్‌తో డ్యాన్స్ చేసే ఎన్టీఆర్ తో స్టెప్పులేయ‌డ‌మంటే పెద్ద టాస్క్అని పేర్కొంది.

వర్క్ విషయంలో తారక్.. ఎంతో డెడికేషన్‌తో వర్క్ చేస్తారన్నారు. ఇక బాల‌య్య గురించి మాట్లాడిన స‌దా ఆయ‌న‌తో క‌లిసి వీర‌భ‌ద్ర సినిమాలో న‌టించారు.ఆయ‌న చిన్న పిల్లాడిలా ఉంటార‌ని పేర్కొంది. సెట్స్‌తో పాటు బయట కూడా ఎంతో యాక్టివ్‌గా ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఆయన ఎనర్జీకి మారు పేరు అంటూ చెప్పుకొచ్చారు.ఇక విక్ర‌మ్‌తో జ‌రిగిన ఫ‌న్నీ ఇన్సిడెంట్ గురించి చెప్పుకొచ్చింది.

విక్రమ్ స‌దాను సోదరి అని అనేవారట. ఈ విషయం తెలుసుకున్న శంకర్ షాక్ అయ్యారట. నేను ఏదో మిమ్మల్ని సీతారాముడిలా చూపిద్దామని ప్రయత్నిస్తుంటే మీరేంటి ఇలా పిలుస్తున్నారు.. ఈ విషయం మీడియాకు లీకై బయటకు తెలిస్తే నా సినిమా ఎవరైనా చూస్తారా? అని శంకర్ ఆవేదన చెందారట. నాటి విషయాన్ని చెబుతూ సదా తెగ నవ్వేశారు.

ఇక మాధ‌వ‌న్‌తో తాను ఏకంగా మూడు సినిమాలు చేయ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య ఎఫైర్ ఉంద‌ని జోరుగా ప్ర‌చారం సాగింద‌ట‌. అయితే ఇండ‌స్ట్రీలో ఇలాంటివి కామ‌న్ కాబ‌ట్టి తాను వీటి గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోలేద‌ని పేర్కొంది స‌దా

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us