Priyanka Mohan: క్యూట్ లుక్‌లో కనిపిస్తున్న ప్రియాంక‌.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్

Priyanka Mohan: నాని నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా తో హీరోయిన్‌గా నటించిన వెండితెరకు పరిచయం అయ్యింది ఈ కన్నడ ముద్దుగుమ్మ ప్రియాంక అరుల్ మోహన్‌.. ఆకర్షించే అందంతో కుర్రాళ్ల మనుసును కొల్లగొట్టింది.శ‌ర్వానంద్‌ హీరోగా బి.కిషోర్‌ దర్శకత్వంలో `శ్రీకారం` చిత్రం రూపొంద‌గా, ఇందులోను ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌గా నటించి అల‌రించింది.

Priyanka Mohan

ఇక ప్ర‌స్తుతం నాగ చైత‌న్య వెబ్ సిరీస్ చేస్తుండ‌గా, ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. నాని హీరోగా నటించిన “గ్యాంగ్ లీడర్” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రియాంక అరుల్ మోహన్ ఈ మధ్యనే తెలుగు డబ్బింగ్ సినిమా అయిన “వరుణ్ డాక్టర్” తో మంచి హిట్ ను అందుకుంది. తెలుగులో కూడా మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ప్రియాంక కి ఈ ప్రాజెక్టు ఎంతవరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి.

సినిమా ప‌రిశ్ర‌మ‌లో క‌ష్ట‌మొక‌టో స‌రిపోదు. అదృష్టం కూడా క‌లిసి రావాలి. ఇక హీరోయిన్స్ విష‌యంలో ఇదే విష‌యాన్ని అన్వయించాలంటే.. గ్లామ‌ర్ ఉంటే స‌రిపోదు.. అదృష్టం కూడా క‌లిసి రావాల‌ని అంటుంటారు. కోలీవుడ్ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహ‌న్ విష‌యంలో ఈ సూత్రం ప‌క్కాగా స‌రిపోతుంద‌ని అంటున్నాయి సినీ వ‌ర్గాలు.

Priyanka Mohan

నాని గ్యాంగ్ లీడ‌ర్‌, శ‌ర్వానంద్ శ్రీకారం చిత్రాల్లో ఈ అమ్మ‌డు హీరోయిన్‌గా న‌టించింది. ఈ రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో స‌క్సెస్ కాలేదు. త‌మిళంలో మంచి అవ‌కాశాలే వ‌స్తున్న‌ప్ప‌టికీ, తెలుగులో మాత్రం ప్రియాంక అరుల్ మోహ‌న్‌కు హీరోయిన్‌గా అవ‌కాశాలు త‌గ్గాయ‌నే అంటున్నారు. దీంతో ఈ చెన్నై బ్యూటీ సెకండ్ హీరోయిన్‌గా కూడా న‌టించ‌డానికి ఓకే చెబుతుంద‌ని సినీ వ‌ర్గాలు అంటున్నాయి.

సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రియాంక అప్పుడ‌ప్పుడు త‌న అంద‌చందాల‌ను ఆర‌బోస్తూ ర‌చ్చ చేస్తుంటుంది. తాజాగా క్యూట్ లుక్‌లో ముసి ముసి న‌వ్వులు న‌వ్వుతూ మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది ప్రియాంక‌. ఈ అమ్మ‌డి పిక్స్ వైరల్ గా మారాయి.